Sunday 15 November 2015

అన్న = అమ్మ+నాన్న.!

అన్న= అమ్మ + నాన్న ! . ఈ కధ చదివితే మీరూ ఔను అంటారు . . . ప్రదీప్ కి పుట్టిన రోజు కానుక గా అన్నయ్య ఒక కారు పంపించాడు . ప్రదీప్ ఆ కారులో ఆఫీసు కి వెళ్ళాడు . సాయంత్రం ఆఫీసు నుండి వస్తూ ఉంటె ఒక పిల్లవాడు ఆ కారు చుట్టూ తిరుగుతూ దాన్ని ఆనందం గా చూస్తున్నాడు . దాన్ని ప్రేమగా తడుముతున్నాడు . ప్రదీప్ కారును సమీపించాడు . వాడిని చూస్తే పేదగా ఉన్నా ఏదో ప్రత్యేకత కనిపించింది ప్రదీప్ కి . " ఈ కారు మీదాండీ ! చాలా బావుంది " అన్నాడు . " దీన్ని మా అన్నయ్య నాకు గిఫ్ట్ ఇచ్చాడు " అన్నాడు ప్రదీప్ . " అయితే మీకు ఈ కారు ఫ్రీగా వచ్చిందా ? మీరు అస్సలు డబ్బులు ఖర్చు పెట్టలేదా ? " లేదు అన్నాడు ప్రదీప్ . . ." నేనూ అలాంటి అన్నను అవుతా ! " అన్నాడు ఆ అబ్బాయి . . . ( ఆ అబ్బాయి మనసులో తనకూ అలాంటి అన్న ఉంటె బాగుండును అని అనుకుంటూ ఉంటాడు అని అనుకున్నాడు ప్రదీప్ . కానీ ఆ అబ్బాయి సమాధానం అతన్ని ఆశ్చర్య పోయేలా చేసింది .) . " కారు ఎక్కుతావా ?" అడిగాడు ప్రదీప్ . " మా ఇంటికి తీసుకు వెళ్ళ గలరా ? " అడిగాడు ఆ అబ్బాయి . ఎందుకో ప్రదీప్ కి ఆసక్తి కలిగింది . సరే అన్నాడు . ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ కి తాను కారులో రావడం చూపిస్తాడు . పోన్లే ఆ కుర్రాడి సంతోషం ఎందుకు పోగొట్టడం అనిపించి కారులో అతడిని ఎక్కించుకుని ఆ సందులోకి వెళ్ళిన ప్రదీప్ కి కళ్ళు చెమ్మగిల్లాయి . . ఆ కుర్రాడి ఇంటికి దగ్గరగా తీసుకు వెళ్ళాడు . ఇక్కడే ఉండండి అంకుల్ అంటూ లోపలి వెళ్ళిన ఆ అబ్బాయి భుజాన రెండు కాళ్ళూ చచ్చు బడిపోయిన తన తమ్ముడిని ఎత్తుకుని బయటకు తీసుకు వచ్చాడు . కారు కేసి చూపిస్తూ ... . " నేను పెద్దయ్యాక నీకు ఇలాంటి కారు కొని ఇస్తాను . అప్పుడు నువ్వు నేను చెప్తూ ఉన్న వాటిని అన్నిటిని నీ అంతట నువ్వే చూడొచ్చు . మార్కెట్లూ , స్కూళ్ళూ , సినిమాలూ , కాలవలో , వంతెనలూ అన్నీ చూడొచ్చు " . ప్రదీప్ కి కళ్ళు చెమ్మగిల్లాయి . కారు దిగి వచ్చి ఆ అబ్బాయినీ , వాడి తమ్ముడినీ కారులో ఊరంతా తిప్పాడు . . . అప్పుడు అనిపించింది ప్రదీప్ కి " పొందడం లో కన్నా ఇవ్వడం లో సంతోషం " ఉంది అని

No comments:

Post a Comment