Sunday 20 September 2015

జగత్తు పదార్ధం శక్తి

జగత్తు - పదార్ధం - శక్తి :-
ఐన్‌స్టీన్ సిద్ధాంతం ప్రకారం శూన్యాకాశం నుండి కాలాన్ని వేరుచేయలేము. కనుక బృహత్తరమైన వస్తువుల సమక్షంలో శూన్యాకాశం వంపు చెందడమే కాక కాలగతి కూడా మారుతుంది.
దేశ కాలాలు (space-time) పరిశీలకుడు ప్రకృతి క్రియను వర్ణించే భాషలొని అంశాలు మాత్రమే.
అందువల్ల ద్రవ్యరాశిత్వం కూడా శక్తి యొక్క రూపమే. స్థిరంగా ఉన్న వస్తువులోని శక్తి దాని ద్రవ్యరాశి రూపంలో ఉంటుంది. ఆ వస్తువు కాంతి వేగంతో ప్రయాణిస్తే అది కాంతి అనే శక్తి రూపం ధరించి, దాని ద్రవ్యరాశిత్వం నశిస్తుందని తేలింది.
పదార్ధం అస్థిరమైందనీ, అంటే సృష్టి వినాశనాలు కలదనీ ఋజువైంది.
సాంప్రదాయక సిద్ధాంతంలోని ప్రాధమిక కణము, భౌతిక పదార్ధము, విడిగా ఉన్న వస్తువులు – మొదలైన భావాలు వాస్తవం కాదనీ, ఈ విశ్వమంతా విడదీయనలవికాని శక్తి వలయాల క్రియాత్మకమైన కూర్పనీ ఋజువైంది. పరిశీలకుడు కూడా దీని నుండి విడదీయడానికి వీలుకాని రీతిన ఇమిడి ఉన్నాడనీ ఋజువైంది.
ఇవన్నీ సాపేక్ష సిద్ధాంతంలోవే.
అద్వైత సిద్ధాంతం చెప్పిన - జగత్తు మిధ్య అనే భావంతో ఇది సరిపోతోంది. అంటే అసలైన వస్తువు అని చెప్పదగింది ఎదీ ఈ విశ్వంలో లేదు. ఉన్నదంతా శక్తిరూపమే.
సైన్స్ ఇంతవరకూ ప్రాధమిక కణం అంటే ఏమిటో నిర్ధారించలేకపోయింది.
కణాలు పదార్ధంతో చేయబడి ఉండనక్కర్లేదనీ, శక్తియే ద్రవ్యరాశిత్వం గల కణాలుగా ప్రవర్తిస్తుందనీ నేటి భౌతిక శాస్త్రం కనుగొన్నది.
పదార్ధమనేది వ్యవహార సౌలభ్యం కోసం సృష్టి గురించి మనమేర్పరుచుకున్న భావం మాత్రమే గాని తత్వతః వాస్తవం కాదు.
"బ్రహ్మమే జీవితం. బ్రహ్మమే అనందం. బ్రహ్మమే శూన్యం... ఆనందం, శూన్యమూ ఒక్కటే" - ఛాందోగ్యోపనిషత్తు.

Monday 14 September 2015

దేశ సంస్కృతిని అర్ధం చేసుకోలేని వారు
వితండ వాదం ...బాగా అలవాటు అయ్యింది...దేశ సంస్కృతిని
అర్ధం చేసుకోలేని వారు....ఈ దేశం లో హిందువు అన్న పదం
ఒక్క మతానికి చెందింది కాదు....అని విదేశీయుడు వచ్చి
దీని ప్రచారం కలిపించాడు ....
ఈ దేశం లో వున్నవాడు హిందుస్తానీ అని అంటారని నువ్వు
చెప్పిన తురకొల్లు ..హింద్ అని వాడుకున్నారు...
నీకు తురకొల్లు ,కిరస్తానోల్లు తెలుసా....ఎలా
తెలుసు...ఎక్కడి నుండి వచ్చారు....మనలని దోచుకున్తానికి
వచ్చినాడు...బెదిరింపులకు,డబ్బు ఆశపడి
మారినవారు...వూరికి పిడికెడు కూడా లేని వారు నీకు
తెలుసు...మన మద్యలో ఉన్న వారు నీకు
తెలియదు...నీకు తెలిసిన కిరస్తానోడు..ఇక్కడి
పోచమ్మ ప్రసాదం పెట్టి చూడు....నీవు చుసిన తురకోడికి
మైసమ్మ ఏట మాంసం పెట్టి చూడు ..తింటే అప్పుడు
ఇలాంటి ప్రేల్లపణలు వింటారు...అంతే గాని అయన
ముట్టుకోనివ్వలేదు ...కాని వాడు నిన్ను నీ తిండిని
అంటుకోలేదు....మనవాడు ఇవ్వాళా మారడానికి సిద్దంగా
వున్నాడు...నీవు చెప్పినాడు ఎవడు సిద్దంగా లేదు...నేను
చెప్పిన పోచమ్మ ,మైసమ్మ ప్రసాదం తినడానికి ...
ప్రతి దానికి ఒకే హిందూ వ్యతిరేకతను
నవ్వుకుంటారు...ప్రజలు
ఈ దేశం లో రకరకాల పద్దతులు పాటిస్తారు...వారిని ఒక
ఛత్రం లోకి చేసి హిందువులుగా చెప్పిన అంబేద్కర్ నీకు
పిచ్చివాడి లాగ కనబడుతున్నడా....ఎప్పుడు హిందూ
అనగానే వెర్రి ఎత్తినట్టు వ్యతిరేకించడం మానుకుంటే
చరిత్ర తెలిసిన వారుగా అంగీకరిస్తారు...అంబేద్కర్ తన
రచనల్లో ఎందుకు హిందూ అన్న పదం వాడారో అతని
ఆలోచనలని చదివిన వారికి తెలుస్తుంది....అంబేద్కర్ ని
అర్ధం చేసుకోలేని కమ్యూనిస్ట్ బావదారిద్ర సిద్దంతపు
పైత్యపు పుస్తకాలు చదివి...దళితులూ ,గిర్జనులు
హిందువులు కాదు ఐతే రాజ్యాంగం ను
వ్యతిరేకిస్తూ...అంబేద్కర్ ని గోరవిస్తావో....లేక
కమ్యూనిస్ట్ దళిత ఆలోచనలను అంగీకరిస్తావో
తేల్చుకో....
దేశం లో కొంత మంది ప్రేలాపనలు దళిత బహుజనులు
పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు....
హిందూ ధర్మ జీవన విదానం అంటే ఒక మతానికో
,,,వర్గానికో చెందింది అని ఎవరు చెప్పారో వారికి ....మీరు
ప్రశ్న వేయండి....ఈ దేశం లో అనేక జీవన విదానాలు
కలిస్తే హిందుజీవనవిదానం అని చెప్పిన అంబేద్కర్ మీకు
ఆదర్శప్రాయుడు కాదని చెప్తే ...ఇక ఎవడు
మిమ్మలిని అడగడు...
హిందుదర్మం అర్ధం చేసుకోలేని వాడు దేశాన్ని అర్ధం
చేసుకోలేడు....దేశం లోని సాంస్కృతిక జీవన విలువలను దెబ్బ
తీయడానికి విదేశీ మతసంస్క్రుతులు వేగంగా
చొచ్చుకొస్తున్నాయి....అవి నీవు చెప్పిన గ్రామా
దేవతలను,గ్రామసంస్క్రుతులను,దళిత దేవుళ్ళను బైండ్ల
చరిత్రను నాశనం చేయడానికి వారి కుల చరిత్రను
మరిచేలా చేసి వారి ఘనమైన గత చరిత్రను కేవలం
నీచమైనదిగా చెబుతూ వారిని గతమే లేని సాంస్కృతిక జీవన
విలువలు నశించి బావదరిద్రపు విదేశీ సంస్కృతిని
స్వీకరించలేక మల్లి మోద నమ్మకాల వైపు
పయనిస్తున్నారు...వీలైతే మతం మారిన దళిత ప్రజల
జీవనవిదానం చూడు బ్రదర్....మొండి ఆలోచనలతో
వ్యతిరేకిస్తే మన చరిత్రను మనం
దిగాజార్చుకున్నట్లే..
.
నేను ఇలయ్య ను అబిమానిస్తా..ఎందుకంటే అతను
బహుజన ప్రజల వెతలను ప్రతిబిమ్బచేసినందుకు
...కాని గమ్యం లేని ప్రయాణం ...ఎటుతీసుకెళ్ళ లేదు
...దానికి సాక్షం ఇలయ్య గారు ...వారే ఒక వ్యాసం లో
ఈ సమాజం లో అసమానతలు పోవాలంటే హిందూ స్వామిజి లు
నడుముకట్టి దానిని తొలగించాలని పిలుపు ఇచ్చాడు...అలాగే
నేటి హిందూ సంస్కృతిని శతాబ్దాలుగా దళిత బహుజనులే దాని
సంరక్షిస్తే ...దానిలో వివక్షతను గురి
అవుతున్నారు....అందుకే వివక్షతను ప్రదర్శిస్తున్న
పిడికెడు మందిని మెజారిటీ ప్రజలు సొంత దేవాలయాలు
కట్టుకొని వారి ని బహిష్కరించాలి అప్పుడు వివక్షత అంటే
తెలుస్తుంది అన్నాడు....అతని మార్గం ఏమిటో ....అతను
పూర్తిగా వేరుచేయలేకుండా ఉన్న దళిత బహుజన హిందూ
ప్రజలకు ఒక మార్గం చూపాడు కాని మీలా తికమక బాషలో
మాట్లాడలేదు....
అందుకే హిందుత్వాన్ని తిట్టడం కంటే దానికి ఆదిపత్యం
వహించి....సంస్కరించుకోవాలి ..కాని దూరం గా పారిపోతే ఎప్పుడు
అర్ధం కాదు సమస్య తీరదు...

మన విధ్యా విధానం


బలహీనతకు దారి తీసే విద్యావిదానాన్ని నేను
నిరసిస్తాను
మనుషులుగా వెళ్లి గొర్రెలుగా వస్తున్న మన విద్యా
విదానం ....నిజరూపం చుడండి .
మన విద్య విదానం ఎలా వున్దకుదదో అలా వుంది....
స్వామి వివేకానందుడు తన రచనలలో విదేశీ విద్యా
విదానం ఎటువంటి మానసిక బానిసత్వాన్ని
గురుచేస్తుందో....ఇలా చెబుతారు..
''బలహీనతకు దారి తీసే విద్యావిదానాన్ని నేను
నిరసిస్తాను . పురుషుడు కాని ,స్త్రీ కాని ,బిడ్డ కాని
శారీరక ,మానసిక , తాత్విక విషయాలలో దేనినైన
శిక్షణ గ్రహిస్తున్నప్పుడు వారు తగిన పుష్టిని
కలిగియున్నారా .. లేదయని విమర్శించుకోవాలి .
వ్యక్తిని సమకుర్చేది సత్య సందత మాత్రమె
.సత్యమే జీవితానికి మూలదారం .సత్యం
అలవార్చుకోటానికి ద్రుడత్వం కావాలి.కనుక మనస్సును
బలహీన పరిచే ఎ విదానం కూడా వ్యక్తిని చాదస్తునిగా
,నిస్తేజునిగా ,వ్యర్ద ఆలోచనలకూ నిలయునిగా
తయారు చేస్తాయి . అలాంటి సంస్తలు ఎలాంటి మంచి
ఫలితాలని సమకుర్చక పోగా , వ్యక్తిలో మానసిక
దౌర్బల్యాన్ని ,నిస్సత్తువను పెంచి సత్యాన్వేషణకు
అనర్హునిగా చేస్తుంది ''
''స్వామి వివేకానంద ''
అటువంటి విద్యావిదానాన్ని చదువుకొని ..మనం ఉత్త
అప్రయోజకులం ..పనికి రాని వారం అని చదువుకుంటూ...విదేశీ
రాజులు మనలని అంతా అద్బుతం గ పరిపాలించారు...వారి
ఎన్నో రకాలుగా ప్రజలను మెప్పించారు....లాంటి
అత్మగోరవం లేని విధ్య చదువుకుని ఎలాంటి వారు
తయారు అవుతాము....దేశం లో ఒక ''మెకాలే ''
విద్యావేత్త చెబుతూ భారత్ ను దెబ్బ కొట్టాలంటే వారి
సంప్రదాయిక విద్యని నాశనం చేస్తే వారు ఆటోమాటిక్ కా
చరిత్ర లేని వారిగా బ్రమించి మనకు నిత్యం బానిసలుగా
వుంటారు...వారు గొప్ప చరిత్రకు వారసులు అన్న విషయం
వారికి తెలిస్తే ఇక వారిని మనం పరిపాలించడం అసంబవం
అని అంటాడు....
చివరకు మనలను బానిసలుగా చుసిన వాడు రాసిన విద్యనూ
చదివి ఇదే నిజమైన చరిత్ర అనుకుని దానిని
ఆచరిస్తూ,...నిత్యం దేశం పట్ల ప్రేమ లేని వారిగా
...నిస్తేజప్రజలుగా ...మిగిలి పోయాము....
చాల మంది మాకు దేశ బక్తి ఉందండి...అని జెండా పండుగలు
చేసుకుని గాంధి కి దండ వేసి...పిప్పరమెంట్ బిళ్ళలు తిని
ఇంటి కి వెళ్లి ...పడుకున్తున్నాము...
కాని దేశ బక్తి అంటే జెండా పండుగ రోజు జెండా
ఎగురవేసుకోవడమేనా .. స్వతంత్రం ఎలా వచ్చిందో మనకు
సంబంధం లేని విషయం గా చూస్తూ ...ఏదోలా రోజు గడిచేలా
చేస్తున్నాము...
దేశం అంటే సరిహద్దులు మాత్రమేనా....దేశం అంటే మట్టి
మాత్రమేనా...ఎలా దీనిని పరిగణించాలి .....దేశం
సరిహద్దులు అన్ని దేశాలకు వుంటాయి....కాని మన
దేశానికి వేలాది సంవత్సరాల చరిత్ర వుంది మనం
నమ్ముతామా...లేక విదేశీయులు ..చెప్పినట్లు....4000
వేల సంవత్సరాలకిందనే సృష్టి మొదలయ్యింది అనేవారికి
ఇప్పుడు ప్రపంచం దొరుకుతున్న ...ఆనవాళ్ళు ఎలాంటి
సమాదానం చెప్పాలి.....
దేశం అంటే సంస్కృతీ,వారసత్వ సంపద,,పురాతన మన
చారిత్రక యుగపురుషులు.వేదాలు,ఉపనిషద్ లు ,మన
గాధలు ఇవన్ని మన దేశానికి గుర్తింపు నిచ్చే ''ఆస్తులు ''
వాటిని గురుంచి తప్పుడుగా చదువుకుని సమస్యలకు మూలం
ఇవే అనేలా చరిత్రని తప్పుడు గా రాసిన బ్రిటిష్
వారు....,వారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న
కమ్యూనిస్ట్ లు ...దెశబక్తి లేకుండా...దేశం పైనే యుద్ధం
ప్రకటించే లా చేస్తున్నారు.....
మనలని తల ఎత్తుకుని నిలబడేలా వున్నా మన
చారిత్రక సంపదను ,మన శాస్త్రాలను ,వేదాలను
,అద్యయనం చేసి వాటిలోని అనేక విలువైన
సమాచారాన్ని భారత్ ప్రజల ఆస్తిగా మలచవలసిన
అవసరం వుం

స్వామీ వివేకానంద

విశ్వమత మహాసభలో ''అమెరికా సోదర
సోదరిమనులారా ! అన్న ఆత్మీయ సంబోదనతో విశ్వ
వేదిక పై స్వామి వివేకానంద ప్రప్రదమంగా అడుగు
పెట్టారు .అక్కడకు వచ్చిన ఆరువేలమంది శ్రోతలు ఈ
ఐదు మాటల సంబోదనతో 5 నిమిషాలు కరతాళ ధ్వనులతో
మారుమోగించడం జరిగింది.ఒక నవీన మత ప్రవక్త
వుద్బవిన్చాడని తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు...ఆ
ప్రసంగం లో అమెరికా దేశాస్తులను ఉద్దేశిస్తూ ''ప్రపంచం
లో అత్యంత ప్రాచీన యతి సంప్రదాయం పేర ;సమస్త
మతాలకు ,సమస్త ధర్మాలకు తల్లి అనదగ్గ
సనాతన దర్మం పేర ; నానా జాతులతో ,నానా
సంప్రదాయాలతో కూడిన భారత జన సహస్రాల పేరిట
మీకు నా అబివాదాలు ''
హిందూ మతం సర్వాన్ని తనలో ఇముడ్చుకునే తత్త్వం
కలిగి వున్నదని తెలిపాక అయన ఇలా ప్రకటించారు '' ఈ
ఆదునిక వైజ్ఞానిక ఆవిష్కరణలు ఎ అతున్నత వేదాంత
సత్యాల నిమ్న ప్రతి బింబాలో దాని మొదలు అతి
ప్రాదమిక స్తాయి గా బావించే విగ్రహారాదన ,రకరకాల
పురాణ గాధలు బౌద్దుల అజ్ఞేయవాదం ,జైనుల
నాస్తికత్వం --ఇవ్వన్ని హిందూమతం లో సముచిత స్తానం
ఇచ్చి చేర్చుకోబడ్డాయి .'' తన చికాగో ప్రసంగం లో వివిధ
మత శాఖల అనుయులను ఎకీకకరణం చేసే నవీన
సిద్దాంతాలు స్వామి ప్రతిపాదించారు.
విశ్వమత మహా సభలో అందరికి అబిమాన వక్త
అయ్యారు ఎవరైనా రణగొణ ధ్వనులు సృష్టిస్తూ
మాట్లాడితే శ్రితాలను ఉత్తేజం చేయడానికి ...తరువాత
స్వామి వివేకానంద ప్రసంగం వుందని ప్రకటించే వారు .
''ఇది స్వామి జీవిత చరిత్ర నుండి సెకరించనైనది''

గంగా జలం గురించి సైన్సు చెబుతున్నదేంటి. ?

గంగా జలం గురించి సైన్సు చెబుతున్నదేంటి?
ఓం
Secrets of Sacred River Ganga-1
గంగా జలం గురించి సైన్సు చెబుతున్నదేంటి? ఆ నది నీటిలో
రహస్యాలేంటి?
ఒక్క మునకతోనే సమస్తపాపాలు తొలగించే శక్తి పరమ
పవిత్రమైన గంగకు ఉందని ధార్మిక గ్రందాహాలు
చెబుతున్నాయి. గంగ మీద ఆధునిక కాలంలో జరిగిన
పరిశోధనలు చాలా ఆశ్చర్యపరిచే విషయాలు
వెల్లడయ్యాయి.
యాంటి - బ్యాక్టీరియల్ శక్తి :
1896 లో ' ఈ హంబురె హంకిన్ (E. Hanbury Hankin)
' అనే బ్రిటిష్ వైద్యుడు ( British physician) గంగా
జలం మీద పరీక్షలు జరిపి, ప్రెంచి పత్రిక అన్నాలెస్
డి ఇన్స్టుట్ పాశ్చర్ (Annales de IInstitut
Pasteur) లో ఒక పరీశొధనా వ్యాసం రాశారు. దాని సారాంశం
ప్రాణంతకమైన కలరా వ్యాధిని కలిగించే bacterium
Vibrio Cholerae ని గంగా నీటిలో వెసినప్పుడు అది
కేవలం 3 గంటల్లోనే పూర్తిగా నశించింది. అదే
బ్యాక్టీరియా శుద్ధి చేయబడిన జలాల్లో (distilled
water ) 48 గంటల తరువాత కూడా జీవనం కొనసాగించింది.
ఇది మన గంగమ్మ తల్లి శక్తి.
సి. ఈ. నీల్సన్ అనే బ్రిటిష్ వైద్యుడు భారత్ నుండి
తిరిగివెళ్తూ, గంగా నది ప్రవాహంలో అత్యంత
కాలుష్యమైన ప్రదేశమైన హూగ్లీ నుండి గంగా నీటిని
నౌకలో ఇంగ్లాండు తీసుకువెళ్ళాడు. అంత కలుషితమైనా కూడా
గంగ నీరు ఆయన సుదీర్ఘ ప్రయాణంలోనూ, ఆయన
ఇంగ్లాండుకు చేరిన తరువాత కూడా ఆ నీరు పరిశుద్ధంగానే
ఉంది. మాములు నీటిని గాలి చొరబడని సీసాలో పెడితే
ప్రాణవాయువు లేని కారణంగా ఆ నీటిలో వాయురహిత
బ్యాక్టీరియా (anaerobic bacteria) వృద్ధి చెంది
నీరు వాసన వస్తాయి. ఆ వాసన దాదాపు కుళ్ళు వాసనలాగే
ఉంటుంది. కాని గంగ నీరు మాత్రం పరిశుద్ధంగానే ఉంది. ఇది
గంగకున్న శక్తి.
ఇది మనం కూడా గమనించవచ్చు. కాశీ యాత్రకు
వెళ్ళినవారు గంగాజలాన్ని ఇంటికి తీసుకువస్తే అది ఎన్ని
సంవత్సరములు గడిచినా చెడిపోదు, కుళ్ళువాసన రాదు. ఇది
మన హిందువులు పూజించే గంగమ్మ తల్లి శక

జన్మభూమి

జన్మభూమి కన్న స్వర్గంబు వేరేది
మాతృభాష కన్న మధుర మేది
తల్లికన్న వేరె దైవమింకేదిరా?
తెలియుమోయి నీవు తెలుగు బిడ్డ!
మధుర మధురమైన మనభాషకంతెను
చక్కనైన భాష జగతి లేదు
పాలకంటె తనయులకే పలు
బలమునీయ గలవు తెలుగుబిడ్డ!
అలర పలనాటి బాలుడే అన్న యనుము
అమర రుద్రమదేవి నా కప్ప యనుము
తిక్కనామాత్యుడే గురుదేవు డనుము
ఇట్టి వీరాంధ్రజాతిలో బుట్టి అనుము

సూర్యుడిని ఏఏ సమయాల్లో చూడరాదు.??

సూర్యుడ్ని ఏఏ సమయాల్లో చూడరాదు?
ప్రభాతవేళ, సూర్యాస్తమయవేళ,
మిట్టమధ్యాహ్న సమయమున రవిని సూటిగా
చూడరాదు. అలాగే సూర్య మరియు చంద్రగ్రహణ
సమయాల్లోనూ చూడరాదు. అట్టి సమయాల్లో
సూర్యుని నుంచి వెలువడే కిరణాలు మానవశరీర
నిర్మాణానికి కీడును కలిగిస్తాయి.

ఏడు సంఖ్య మంచిదా కాదా.??

ఏడు’ సంఖ్య మంచిదా కాదా?
తిరుమల తిరుపతిలో కొండలు 7. ప్రత్యక్షదైవం
సూర్య భగవానుడి నుంచి వచ్చే కిరణాలు 7, పాతాళం
క్రింద లోకాలు 7, భువర్లోకాలు 7. అలాగే ద్వీపాలు 7.
పెళ్ళిలో వధూవరులు ఇద్దరూ కలిసి వేసే అడుగులు 7.
అగ్ని దేవుని నాలుకలు 7. బ్రహ్మోత్సవాలు జరిగేది
7వ నెలలో. సప్తస్వరాలు కూడా ఏడే. 7
సంఖ్యమంచిది కాదని కొందరి మూఢనమ్మకము. 7
కూడా మంచిదే. భగవంతుడు సృష్టించిన ప్రతిదీ
మనకోసమే. డాన్ని ఉపయోగించే పద్ధతుల వల్లే
ఫలితం మనకిలభిస్తుంది.

అల్లా ఎవరు. ??

గంగా జలం గురించి సైన్స్ ఏమని చెబుతుంది.??

గంగా జలం గురించి సైన్సు చెబుతున్నదేంటి?
ఓం
Secrets of Sacred River Ganga-1
గంగా జలం గురించి సైన్సు చెబుతున్నదేంటి? ఆ నది నీటిలో
రహస్యాలేంటి?
ఒక్క మునకతోనే సమస్తపాపాలు తొలగించే శక్తి పరమ
పవిత్రమైన గంగకు ఉందని ధార్మిక గ్రందాహాలు
చెబుతున్నాయి. గంగ మీద ఆధునిక కాలంలో జరిగిన
పరిశోధనలు చాలా ఆశ్చర్యపరిచే విషయాలు
వెల్లడయ్యాయి.
యాంటి - బ్యాక్టీరియల్ శక్తి :
1896 లో ' ఈ హంబురె హంకిన్ (E. Hanbury Hankin)
' అనే బ్రిటిష్ వైద్యుడు ( British physician) గంగా
జలం మీద పరీక్షలు జరిపి, ప్రెంచి పత్రిక అన్నాలెస్
డి ఇన్స్టుట్ పాశ్చర్ (Annales de IInstitut
Pasteur) లో ఒక పరీశొధనా వ్యాసం రాశారు. దాని సారాంశం
ప్రాణంతకమైన కలరా వ్యాధిని కలిగించే bacterium
Vibrio Cholerae ని గంగా నీటిలో వెసినప్పుడు అది
కేవలం 3 గంటల్లోనే పూర్తిగా నశించింది. అదే
బ్యాక్టీరియా శుద్ధి చేయబడిన జలాల్లో (distilled
water ) 48 గంటల తరువాత కూడా జీవనం కొనసాగించింది.
ఇది మన గంగమ్మ తల్లి శక్తి.
సి. ఈ. నీల్సన్ అనే బ్రిటిష్ వైద్యుడు భారత్ నుండి
తిరిగివెళ్తూ, గంగా నది ప్రవాహంలో అత్యంత
కాలుష్యమైన ప్రదేశమైన హూగ్లీ నుండి గంగా నీటిని
నౌకలో ఇంగ్లాండు తీసుకువెళ్ళాడు. అంత కలుషితమైనా కూడా
గంగ నీరు ఆయన సుదీర్ఘ ప్రయాణంలోనూ, ఆయన
ఇంగ్లాండుకు చేరిన తరువాత కూడా ఆ నీరు పరిశుద్ధంగానే
ఉంది. మాములు నీటిని గాలి చొరబడని సీసాలో పెడితే
ప్రాణవాయువు లేని కారణంగా ఆ నీటిలో వాయురహిత
బ్యాక్టీరియా (anaerobic bacteria) వృద్ధి చెంది
నీరు వాసన వస్తాయి. ఆ వాసన దాదాపు కుళ్ళు వాసనలాగే
ఉంటుంది. కాని గంగ నీరు మాత్రం పరిశుద్ధంగానే ఉంది. ఇది
గంగకున్న శక్తి.
ఇది మనం కూడా గమనించవచ్చు. కాశీ యాత్రకు
వెళ్ళినవారు గంగాజలాన్ని ఇంటికి తీసుకువస్తే అది ఎన్ని
సంవత్సరములు గడిచినా చెడిపోదు, కుళ్ళువాసన రాదు. ఇది
మన హిందువులు పూజించే గంగమ్మ తల్లి శక

Sunday 13 September 2015

మీరు హిందువులైతే కనీసం ఈ క్రింది పనులు చెయ్యండి.

మీరు 'హిందువు'లైతే కనీసం ఇవైనా చేయండి !

1. హిందూహితం కొరకు చట్టబద్దమైన ఆందోళనలలో తనువు, మనస్సు, ధనములను సమర్పించి పాల్గొనండి !

2. మీ నిత్యవసర వస్తువులను హిందువుల వద్దనే కొనండి ! విదేశీ వస్తువులను విడిచిపెట్టి స్వదేశీ వస్తువులను ఉపయోగించండి !

3. హిందూ విద్యార్థులను ధర్మాచరణ (ఉదా : బొట్టు పెట్టుకోవడం, గాజులు వేసుకోవడం, గోరింటాకు పెట్టుకోవడం మొదలైనవి) చేయకుండా చేసే పాఠశాలలను బహిష్కరించండి !
ధర్మరక్షణ కోసం 'హిందూ జనజాగృతి సమితి' మీకు సహాయం చేస్తుంది !

గోవును ప్రోత్సహించడం అంటే ధర్మపాలన చెయ్యడమే

గోపాలనను ప్రోత్సహించడం అంటే ధర్మ పాలన చేయడమే !

33 కోట్ల దేవతలు నివాసముండే (దేవతా తత్త్వాలను ఆకర్షించే) గోమాత హిందువుల దేవత. ప్రతి రోజు గోగ్రాసం, శుభకార్యములలో గోపూజ చేయడం, గోదానం చేయడం శ్రేయస్కరం. వీటితో పాటు ఈ పవిత్ర గోవులను పోషించే ప్రయత్నం కూడా చేయండి !

గోసంవర్ధనకై వీటిని చేయండి !
1. దైనందిన ఆహారంలో భారతీయ జాతి ఆవుల పాలు, పెరుగు, నెయ్యినే వాడండి !
2. పంచగవ్యంతో చేసిన పళ్ళపొడి, సబ్బు, అగర్బత్తీలు, ధూపం మొ|| వాటిని వాడండి !
3. గోశాల నిర్మాణానికి స్థలం, కావలసిన పరికరాలు, ధనం, గోసంపద, దాణా లాంటి వాటిని దానం చేయండి ! 4. మీ శక్తి కొలది ఇంటిలో ఒక ఆవు-దూడల పాలన-పోషణ చేయండి !

గో మాంస భక్షణ మహా పాపం !
1. విదేశీ కంపెనీలు తయారు చేసే 'పిజ్జా' 'బర్గర్‌' మొదలైన వాటిలో గోమాంసపు పలుచటి పొర ఉంటుంది. కాబట్టి విదేశీ కంపెనీల తినుబండారాలన్నింటినీ బహిష్కరించండి !
2. మిఠాయిల పైన పలుచటి వెండి పొరకు బదులు గోవంశపు ప్రేగుల నుండి తయారు చేసిన పొరను వాడుతారు. కాబట్టి ఇలాంటి పొర ఉన్న మిఠాయిలను కొనకండి !

కోటి అనగా

సంస్కృతంలో కోటి అనగా "రకము" అని ఒక అర్థం కలదు.
కావున ముప్ఫై మూడు రకాల దేవతలు అని మనం అర్థం చేసుకోవాలి

ప్రతీ ఒక్కరూ ఇలా ఆలోచించండి

మనం అంటే మన కుటుంబం మాత్రమే కాదు.
మన చుట్టూ ఉన్న మనుషులు కూడా మన కుటుంబంగానే పరిగణించాలి.
సమాజం అనే మాటకి అర్ధం అదే...
సమాజం అంతా ఒకే కుటుంబంగా ఉండగలిగితే
సమస్యలు తగ్గుతాయి.
సంఘం అంటే కూడా అర్థం అదే, అంతా కలిసి మెలిసి ఉండాలి.
బహుశా అందుకేనేమో దేవుడు మనందరి రక్తాన్ని ఒకే రంగులో పెట్టాడు.
ఒకరిని ఒకరు పట్టించుకునే మన పాత సాంప్రదాయక సమాజమే ముద్దు.

ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామదేయాలు

ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామధేయాలు.
:::::::::::::::::::::::::::::::::::::
రామాయణం
:::::::::::::::::::::::::::::::::::::

1.   భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం - గంగోత్రి, ఉత్తరాఖండ్

2.   కపిల మహర్షి ఆశ్రమం,(శ్రీరాముని పూర్వీకులు సగర చక్రవర్తి తనయులు 60,000 మంది కాలి బూడిదైన స్థలం.గంగానది వారి భస్మరాసుల మీద ప్రవహించి వారికి పుణ్యలోకాలు ప్రసాదించి బంగాళాఖాతంలో కలుస్తుంది) - గంగాసాగర్, వెస్ట్ బెంగాల్

3.   కాంభోజ రాజ్యం - ఇరాన్ ( శ్రీరాముని ముత్తాత రఘు మహారాజు సామ్రాజ్యం ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కజఖిస్తాన్, దాటి యింతవరకూ విస్తరించింది).

4.   రక్షస్థలం (రావణుడు తన పది తలలు నరికి శివున్ని పూజించి వరాలు పొందిన చోటు)- లాంగకో, టిబెట్, చైనా

5.   పరమశివుని ఆత్మలింగాన్ని గణేశుడు నేలవైచిన చొటు - గోకర్ణ, కర్ణాటక
6.   సీతాదేవి భూమిలో లభించిన చోటు - సీతామర్హి, బీహార్

7.   మిథిల (సీతాదేవి పుట్టినిల్లు) - జనక్ పూర్, నేపాల్

8.   కోసలదేశం - రాజధాని అయిన అయోధ్య నుండి నేపాల్ లోని కొన్ని ప్రాంతాల వరకు ఉన్న ప్రదేశం

9.   దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేసిన స్థలం - ఫైజాబాద్,ఉత్తర్ ప్రదేశ్.

10.   సరయూ నది (ఈ నదీ తీరంలోనే అయోధ్య నిర్మితమైనది) - ఘాఘర నది.

11.   ఆయోధ్య / సాకేతపురం (శ్రీరాముని జన్మస్థలం,బంగారు సీతతో అశ్వమేధ యాగం చేసిన స్థలం,సరయూ నదిలో మునిగి వైకుంఠం చేరిన స్థలం) - అయోధ్య,ఉత్తర్ ప్రదేశ్.

12.   తాటక వధ జరిగిన ప్రదేశం - బక్సర్, బీహార్

13.   అహల్య శాపవిమోచన స్థలం - అహిరౌలి,బీహార్

14.   కుశనాథపురం (విశ్వామిత్రుడు యాగం చేసిన స్థలం) - సుల్తాన్ పూర్, ఉత్తర్ ప్రదేశ్

15.   గుహుడు సీతారామలక్ష్మణులను కలిసిన చోటు - శృంగబేరిపురం, అలహాబాద్ దగ్గర
16   దండకారణ్యం - చత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లా, ఆంధ్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు.

17.   చిత్రకూటం (సీతారామలక్ష్మణులు వనవాసం చెసిన చోటు) - సాత్న జిల్లా, మధ్యప్రదేశ్.

18.   పంచవటి (శూర్పణఖ ముక్కూచెవులు కోసిన స్థలం) - నాసిక్, మహరాష్ట్ర.


19.   కబంధాశ్రమం - కర్దిగుడ్, బెల్గావి, కర్ణాటక.

20.   శబరి ఆశ్రమం - సర్బన్, బెల్గావి, కర్ణాటక.

21.   హనుమంతుడు రామలక్ష్మణులను మొదటిసారి గా కలసిన ప్రదేశం - హనుమాన్ హళ్ళి, కొప్పాళ, కర్ణాటక.

22.   ఆంజనేయ పర్వతం (హనుమంతుడి జన్మస్థలం), కిష్కింద (సుగ్రీవుని రాజ్యం), ఋష్యమూక పర్వతం -తుంగభద్ర నదీతీర ప్రాంతం, హంపి దగ్గర,కర్ణాటక

23.   విభీషణుడు రాముని శరణు కోరిన స్థలం - ధనుష్కొటి, తమిళనాడు.

24.   శ్రీరాముడు వానరసైన్యం తో వారధి నిర్మించిన చోటు- రామేశ్వరం,తమిళనాడు

25.   రత్నద్వీపం / సింహళం / లంక - శ్రీలంక.

26.   అశోకవనం (సీతాదేవి బందీగా ఉన్న ప్రదేశం) - కాండీ దారిలోని సీత ఏళియ, శ్రీలంక

27.   శ్రీరాముడు రావణుని వధించిన చోటు - దునువిల్ల, శ్రీలంక

28.   సీతాదేవి అగ్నిప్రవేశం చేసిన ప్రాంతం - దివిరుంపోల, శ్రీలంక.

29.   వాల్మీకి ఆశ్రమం / సీతాదేవి కుశలవులకు జన్మనిచ్చిన స్థలం / భూదేవిలో ఐక్యమైన స్థలం - ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ నుంచి 30 మైళ్ళ దూరంలోని బితూర్.

30.   కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) - కుశార్, పాకిస్తాన్.

31.   లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) - లాహోర్, పాకిస్తాన్

32.   తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించిన నగరం) - తక్షశిల, పాకిస్తాన్

33.   పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం) - పెషావర్, పాకిస్తాన్.