Friday 11 September 2015

2.భూగోళమే నా.!!

2.భూ "గోళమే" నా.!

ప్రపథమంగా భూమి గుండ్రంగా ఉన్నది అని చెప్పింది ఎవరు.?

ఇంతవరకూ మనం చదువుకున్నది క్లెపర్ కొపర్నికస్, గెలీలియోలు అని, వీరంతా 16,17 శతాబ్దాలకు చెందిన వారు. మరి మన ప్రాచీన భారతీయులకు "భూమి-గోళం" అని తెలియదా.!

తెలుసు…… వేదకాలం నుంచే ఈ విషయం భారతీయులకు తెల్సు.!

ఋగ్వేదంలో 1.33.8 మంత్రంలో ఇలా ఉంది.

"చక్రాణాసః పరీణహం పృథివ్యా|| ……

- భూమి యొక్క వృత్తపు అంచున ఉన్నవారు అని. భావం……

"సూర్య సిద్దాంతం' అనే అతి ప్రాచీన గ్రంథంలో 12వ అధ్యాయం 32వ శ్లోకంలో

"మధ్యే సమన్తాదణ్ణస్య భూగోళో వ్యోమ్ని తిష్టతి||"

బ్రహ్మండం మధ్యలో భూగోళం ఆకాశంలో నిలిచి ఉన్నదని అర్ధం.

- ఆర్యభట్టు క్రీ.శ 476 ప్రాంతం వాడు……
ఇతను……

"భూగోలః సర్వతో వృత్తః" అని ఆర్యభట్టీయం అనే గ్రంధంలో గోళపాద అనే అధ్యాయంలో 6 వ శ్లోకంలో చెప్పాడు.

అంటే భూమి వృత్తాకారంలో అన్ని వైపులా ఉన్నదని అర్ధం. అంతే కాకుండా భూవ్యాసాన్ని చాలా చక్కటి ఉపమానంతో వర్ణించాడు.
తద్వారా భూవ్యాసాన్ని గుర్తించాడు
( శ్లోకం 1-5 )

- "పంచ సిద్దాంతిక' అనే గ్రంథంలో వరాహమిహురుడు 505 క్రీ.శ లో…

పంచ భూతాత్మికమైన గుండ్రని భూమి, పంజరంలో వ్రేలాడే ఇనుప బంతిలాగా……
ఖగోళంలో తారల మధ్య నిలిచి ఉంది అన్నాడు.

"పంచ మహభూతమయస్తారాగణ పంజరే మహీగోళః||"……… (13-1)

లీలావతి అడిగిన ప్రశ్నకు - భాస్కరాచార్యుడు అనే ప్రముఖ గణిత శాస్ర్తజ్ఞుడు - " నీవు చూసేదంతా నిజం కాదు. భూమి 'చదరంగా' లేదు. ఎందుకంటే నీవు ఒక పెద్ద వృత్తం గీసి అందులోని నాల్గవ భాగం చూస్తే అది మనకు ఒక సరళ రేఖలాగా కనిపిస్తుంది. కానీ నిజానికి అది ఒక వృత్తమే. అలాగే భూమి కూడా గుండ్రంగానే ఉన్నది అని ఆమెకు వివరించాడు.
( "లీలావతి" అనే గ్రంథంలోనిది )

ఇక మన "ఆర్యభట్టీయం" అనే గ్రంథం 13 వ శతాబ్దంలో లాటిన్ భాషలోకి అనువదింపబడింది. ప్రపంచ వ్యాప్తంగా తదనంతర ఖగోళ పరిశోధనల మీద ఈ శాస్ర్తం ప్రభావం ఎంతోగానో ఉంది.

ఆర్యభట్టీయంలోని గోళపాదం -37వ శ్లోకంలో ఆర్యభట్టు.

"ఛాదయతి శశీ సూర్యం శశినం మహతీ చ భూచ్ఛాయా" అని చెబుతాడు.
సూర్యున్ని చంద్రుడు కప్పినప్పుడు ఆ నీడ భూమి మీదకు "సూర్యగ్రహనం" గానూ
చంద్రున్ని భూమి కప్పినప్పుడు చంద్రగ్రహణంగానూ కనిపిస్తుంది అని చెప్పాడు

ఇంతే కాకుండా ఈ సూర్య, చంద్ర గ్రహణాల లెక్కలు, రాకపోకలు ఖచ్చితంగా ఆనాడే ఆర్యభట్టు గణించగలిగినాడు.

భూమి తన కక్ష్యలో తన చుట్టూ తాను తిరుగుటకు 23 గంటల 56 నిమిషాల 4.1 సెకన్ల కాలం పడుతుందని ఆనాడే చెప్పాడు.
ఇది ఆధునిక కాల గణనకి ఖచ్చితంగా సరిపోతున్నది కదా.!!

ఈ నాటి జాగ్రఫి అంటే
భూగోళశాస్ర్తం.
కనుకనే భూమిని గురించి చుదువుకునే శాస్ర్తానికి ఆనాడే భూగోళశాస్ర్తం అన్నారు మన వారు.
గోళం అంటే గుండ్రనిది కాదా.!!
ఇది ప్రతీ భారతీయులకు యుగయుగాలుగా తెలుసు కదా.!
"గోళం" అంటే ఏమిటీ.??
దీనిని మేమే కనుగొన్నాం అని ఇతరులు చెప్పటం ఏంటీ.???

No comments:

Post a Comment