Saturday 12 September 2015

శ్రీ కృష్ణ దేవరాయలు


కృష్ణరాయలను తెలుగు మరియు
కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప
చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు.
సాహిత్యములో ఈయన ఆంధ్ర భోజుని గా
మరియు కన్నడ రాజ్య రమారమణ గా
కీర్తించబడినాడు.
ఈయన పాలనను గురించిన సమాచారము
పోర్చుగీసు సందర్శకులు డొమింగో పేస్
మరియు న్యూనిజ్ ల రచనల వలన
తెలియుచున్నది. రాయలకు ప్రధాన
మంత్రి తిమ్మరుసు.
శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం
అధిష్ఠించడానికి కూడా తిమ్మరుసు చాలా
దోహదపదడినాడు. కృష్ణరాయలు
తిమ్మరుసును పితృసమానునిగా
గౌరవించేవాడు.కృష్ణదేవ రాయలు,
తుళువ నరస నాయకుడు, నాగలాంబల
(తెలుగు ఆడపడుచు) కుమారుడు.[1]
ఇతను ఇరవై సంవత్సరాల వయసులో
ఫిబ్రవరి 4, 1509న విజయనగర
రత్నసింహాసనాన్ని అధిష్ఠించినాడు. ఇతని
పట్టాభిషేకానికి అడ్డురానున్న అచ్యుత
రాయలు నూ, వీర నరసింహ రాయలునూ,
అనుచరులనూ తిమ్మరుసు
సుదూరంలో ఉన్న దుర్గములలో
బంధించినాడు.
రాజ్యం అధిష్ఠానం ఇతను రాజ్యం
అధిష్ఠించునాటికి రాజ్యమంతా చాలా
గందరగోళంగా ఉన్నది. దక్షిణాన
సామంతులు స్వతంత్రులు
అయినారు, తీరాంధ్ర ప్రాంతాన్ని
గజపతులు ఆక్రమించుకొని తమ
రాజ్యంలో కలుపుకొని, కొండవీడు,
ఉదయగిరి వంటి పటిష్ఠమైన దుర్గములతో
బ్రహ్మాండమైన రక్షణ ఏర్పాట్లు
చేసుకున్నారు. బహమనీ సుల్తానులు
రాజ్యంలోనికి రోజురోజుకూ చొచ్చుకొని
రాసాగినారు. ఇటువంటి అస్తవ్యస్త
పరిస్థితులలో శ్రీకృష్ణదేవరాయలు
రాజ్యానికి వచ్చినాడు.
దక్షిణ దేశ దండయాత్ర
ఇతను 1509లో సింహాసనం అధిష్ఠించి,
1512 వరకూ మూడు సంవత్సరములు
సైనిక సంపత్తిని పెంపొందించుకొని
తొలిసారిగా దక్షిణ దేశ దిగ్విజయ యాత్రకు
బయలుదేరినాడు.కావేరీ నదీ తీరంలోని
శివపట్టణ పాలకుడు, విజయనగర
సామంతుడైన గంగరాజు, విజయనగర
రాజుల అలసత్వాన్ని ఆధారంగా చేసుకొని
కప్పం చెల్లించక స్వతంత్రముగా
ఉండసాగినాడు. ఇతని శత్రువు శ్రీ
రంగపట్టణ రాజు చిక్క రాయలు. చిక్క
రాయలు శ్రీకృష్ణదేవరాయల సైన్యంలో
చేరి గంగరాజుపై యుద్ధం చేసి
గెలిచినాడు. గంగరాజు కావేరి నదిలో పడి
ప్రాణాలు వదిలినాడు.తరువాత
ఉమ్మత్తూరు, కర్ణాటక, మైసూరు
ప్రాంతములను చేజిక్కించుకొని చిక్క
రాయలును వాటికి సామంతుని గా చేసినాడు.
తరువాత చిన్న చిన్న పాలెగాండ్లను
జయించి ఆ ప్రాంతములకు కెంపెగౌడ, వీర
గౌడలను పాలకులుగా నియమించినాడు.
(ఈ కెంపేగౌడ, వీర గౌడలే బెంగళూరు
నిర్మాతలు). తరువాత మలయాళ
ప్రాంతములను జయించి, వారినుండి
కప్పములను వసూలు చేసినాడు.
విజయప్ప, వేంకటప్ప నాయకులను
పాండ్యదేశమునకు, దాని పరిసరాలకూ
సామంతులుగా నియమించినాడు.
విజయప్పనాయుడు, వెంకటప్ప
నాయుడుతో కలసి రాయలువారి ఆదేశముపై
చిత్తూరు, జింజి, తొండ మండలము,
మధుర, తిరునగరు, తిరుచినాపల్లి
మొదలగు ప్రాంతములను
జయించినాడు. వీరందరి నుండి ఎంతో
కప్పమును వసూలు చేసినాడు. ఒక్క
జింజి నగరమునుండే
సంవత్సరమునకు మూడు కోట్ల
రూపాయల విలువైన కప్పం వచ్చేది. దీనితో
దక్షిణ దేశమంతా రాయలు స్వాధీనమైనది.
పరిపాలనా సౌలభ్యం కోసం దీని మూడు
భాగములుగా విభజించి నాడుజింజి
కేంద్రముగా కృష్ణప్ప నాయకుడు
అధిపతిగా నెల్లూరు మొదలగు
ప్రాంతములు ఉండెను.తంజావూరు
కేంద్రముగా విజయ రాఘవ నాయకుడు
అధిపతిగా కావేరీ నదీ తీరప్రాంతములు
రెండవ కేంద్రము.కొడగు కేంద్రముగా
వెంకటప్ప నాయకుడు అధిపతిగా మళయాళ
ప్రాంతము మూడవ భాగము.
ఈ దక్షిణదేశ దండయాత్ర తరువాత
రాయలు రాజధానికి తిరిగి వచ్చాడు.
తూర్పు దిగ్విజయ యాత్ర
తిమ్మరుసు నాయకత్వంలో చక్కని
సైన్యమును తూర్పు దిగ్విజయ
యాత్రకు పంపించినాడు.
సైనిక విశేషములు
తిమ్మరుసు సైన్యమును చక్కగా
వ్యూహాత్మకంగా విభజించినాడు.
మొత్తం సైన్యాన్ని ఏడు భాగములుగా
విభజించినాడు. ఒక్కొక్క విభాగములోను
కింది దళాలు ఉన్నాయి:
• 30,000 కాల్బలము
• నాలుగు వేల అశ్విక దళము
• రెండువందల ఏనుగులు
ఈ విభాగాలకు అధ్యక్షులుగా కింది వారిని
నియమించాడు.
1. రాయసము కొండమరుసు
2. పెమ్మసాని రామలింగ నాయుడు
3. గండికోట కుమార తిమ్మానాయుడు
4. వెలుగోడు గంగాధరరెడ్డి
5. అకినీడు ఇమ్మరాజు
6. ఆరవీటి నారపరాజు
7. ఆరవీటి శ్రీరంగరాజు
ఉదయగిరి విజయం
ఈ తూర్పు దిగ్విజయ యాత్రలో భాగంగా
1513లో ఉదయగిరి ని ముట్టడించినాడు.
రాయసము కొండమరుసు విజయనగర
సేనలకు ఆధిపత్యము వహించి
సంవత్సరమున్నర పాటు తీవ్రమైన
పోరాటము చేసి దుర్గమును స్వాధీనము
చేసుకున్నాడు. తరువాత ఉదయగిరి
ప్రాంత రాజప్రతినిధిగా అతడే
నియమితుడయ్యాడు. కొండవీడు
విజయం
1515లో రాయలు కొండవీడు ను
ముట్టడించినాడు. కొండవీడు
1454నుండి గజపతుల ఆధీనంలో ఉన్నది.
ఇదే సమయంలో ప్రతాపరుద్ర గజపతి
కృష్ణానది ఉత్తర భాగమున పెద్ద
సైన్యంతో విడిదిచేసెను. ఈ
యుద్ధమున రాయలు విజయం
సాధించాడు. తరువాత రాయలు
కొండవీడును అరవై రోజులు పోరాడి 1515
జూన్ 6 న స్వాధీనం చేసుకున్నాడు.
తిమ్మరుసు మేనల్లుడు నాదెండ్ల
గోపన దుర్గాధిపతిగా నియమితుడయినాడు.
కొండవీడు తరువాత శ్రీకృష్ణదేవరాయల
దిగ్విజయ యాత్ర ఇలా సాగింది.
• అద్దంకి, కేతవరం, అమ్మనబ్రోలు,
నాగార్జున కొండ, బెల్లంకొండ
దుర్గాలను స్వాధీనం చేసుకున్నాడు.
• విజయవాడ సమీపా

No comments:

Post a Comment