Friday 11 September 2015

గోలోకము

గోలోకము

మూడు లోకములకు బ్రహ్మదేవుడు అధిపతి. బ్రహ్మలోకమును గోలోకము అంటారు.పూర్వము విశ్వకర్మ గొప్ప తపస్సు చేసాడు. అమృత రూపిణి కామరూపి అయిన సురభి అనే కన్యని మానస పుత్రిగా సృష్టించాడు. ఆమెతో పాటు మహా తేజోవంతుడైన ఒక పురుషుడిని కూడా సృష్టించాడు. ఆ పురుషుడు ఆ కన్యను చూసి మోహించి ఆమె కొరకు పరితపించ సాగాడు. అది చూసిన బ్రహ్మ "మార్తోభవ " (నీ పరితాపము ఉపశమించు కాక) అని దీవించాడు. అతడికి మార్తాండుడు అని పేరు పెట్టి అతడికి సురభిని ఇచ్చి వివాహము జరిపించి " మీ రిరువురికి పుట్టిన సంతానం యజ్ఞయాగాదులకు అవసరమైన పాలు, పెరుగు, నెయ్యి సమకూరుస్తాయి " అని చెప్పాడు. వారిరువురికి గోవులు సంతానంగా జన్మించాయి. ఆ గోవులు కూడా మానవులకు, దేవతలకు కోరినవి ఇస్తూ వారి చేత పూజలు అందు కుంటున్నాయి.

కామధేనువు

ఒకరోజు కామధేనువు తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై " నీకు ఏమి వరం కావాలో కోరుకో " అని అడిగాడు. కామధేనువు " బ్రహ్మదేవా ! నేను కోరిన వెంటనే నా వద్దకు వచ్చారు. అంత కంటే నాకు కావలసినది ఏమున్నది " అన్నది కామధేనువు. ఆ మాటలకు బ్రహ్మదేవుడు సంతోషించి " నీ లోకమైన గోలోకము అన్ని లోకముల కంటే పైగా ఉండేలా వరం ఇస్తున్నాను. గోలోకము సత్యలోకం కంటే పైన ఉంటుంది " అని పలికాడు.
గోలోకము అంటే శ్రీకృష్ణుడు నివసించే అతి పవిత్రమైన లోకము.

పరమాత్ముడైన శ్రీకృష్ణ భగవానుడు గోలోకమున నివసించు చుండును . ప్రళయ కాలమున లోకములన్నియు నశించినను. జ్యోతిర్మండల రూపమైన ఈ గోలోకము నశింపదు . అటువంటిది ఆ గోలోకము . అది అన్నిలోకములకును పైభాగమున నుండును. దాని క్రింద ఏబది కోట్ల యోజనముల దూరమున కుడి వైపున వైకుంఠమును ,ఎడమ వైపున శివ లోకమును ఉండును.గోలోక మధ్య భాగమున ఒక మహా కాంతి ఉండును. ఆ కాంతికి మధ్యభాగమున నీలమేఘశ్యాముడు, సర్వాదారుడును , సర్వ బీజ స్వరూపుడును అయిన శ్రీ కృష్ణ భగవానుడు , పీతాంబర దారిగా, వేణుగాన హస్తుడగాను ,కోటి చంద్రుల కాంతితో శోభించుచు నివసించును . రాసమండల మధ్యస్తుడై ఈయన రాసేశ్వరుడని పిలువబడును. ఆ శ్రీ కృష్ణ భగవానుడొకసారి విశ్వ మంతటను దృష్టి సారించెను . సర్వమును అందకారముతో నిండియే వస్తువులను లేక సర్వ శూన్యముగా నుండెను .అది చూచిన భగవానునకు సృష్టి చేయవలెనను సంకల్పము కలిగెను. అంతట సృష్టి కారణ భూతములైన సత్వ రజ తమో గుణములు జనించెను. మహత్తు ,అహంకారము ,శబ్ద స్పర్శ రూప రస గంధములను తన్మాత్రలతో పంచ భూతములను పద్మము నుండి పుట్టిన బ్రహ్మ ,శాశ్వతమైన గోలోక , వైకుంఠ ,శివలోకములు తప్ప తక్కిన సృష్టి యంతయు చేసెను.

శ్రీ కృష్ణుడు తన నుండి యావిర్భ వించిన బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులతో గలిసి గోలోకము మధ్య భాగమునందు గల మహా ప్రకాశ వంతమై రాస మండలమునకు వెళ్ళెను .అక్కడ నున్న మేడలు ,కల్ప వృక్షో ద్యాన వనములు , వైభవములు చూచి అందరును పరమాశ్చర్య భరితులైరి.

శ్రీ కృష్ణుని ప్రాణము లాదారముగా చేసికొని అతని వామ భాగము నుండి ఒక అతిలోక సుందరి పడునారెండ్లది ఉదయించెను. ఆమె వెంటనే శ్రీ కృష్ణ సేవకై పరిగిడెను .రాస మండలమున ఆమె రాధగా ప్రసిద్దురాలయ్యెను. ఆమె శ్రీకృష్ణునకు ప్రాణాధికురాలైన ప్రియురాలు —  with వినోద్ ఆర్మూరీ హిందూ, Bajarang Bhasker, హిందూ హిందుత్వం, ప్రజలకు తెలెయని మనిషి, హిందుత్వం నాఊపిరి, మనతల్లి పల్లెసిమ, మన ఊరు మన చెట్టు, మన ఆచారాలు వ్యవహరాలు సమాచారము, హిందూ సనాతన ధర్మం, శుక్లయజుర్వేదకాణ్వశాఖా ప్రచారసమితిః, మన ప్రాణం మన చెట్లు and మన హైందవ ఆచారాలు

No comments:

Post a Comment