Saturday 12 September 2015

శ్రీవేంకటేశ్వరస్వామికి మేలుకొలుపు కీర్తన ప్రతి రోజూ శ్రీవారికి సుప్రభాతంతో పాటు అదేసమయంలో 'మేలుకొలుపు' కీర్తన కూడా వినిపిస్తారు. అన్నమాచార్యుని వంశీయులు తంబురను మీటుతూ బంగారువాకిళ్ల వద్ద ఉండి భూపాళరాగంలో మేలుకొలుపు కీర్తన పాడతారు. ఇదే ఆ కీర్తన... మిన్నక వేసాలు మాని మేలుకోవయ్యా, సన్నల నీ యోగనిద్ర చాలు మేలుకోవయ్య. ఆవులు పేయలకుగా నరచీ బిదుకవలె, గోవిందుడా, యింక మేలుకొనవయ్యా! ఆవలీవలి పడుచు లాటలు మరిగివచ్చి, త్రోవ గాచుకున్నారు ప్రొద్దున మేలుకోవయ్యా! (మిన్నక) పిలిచీ నందగోపుడు పేరుకొని యదె కన్ను గొలుకులు విచ్చి మేలుకొనవయ్యా! అలరిన శ్రీవేంకటాద్రి మీది బాలకృష్ణ, యిల మా మాటలు వింటివిక మేలుకోవయ్యా! (మిన్నక) "ఓం నమో వేంకటేశాయ" "ఓం నమో వేంకటేశాయ" "ఓం నమో వేంకటేశాయ"

No comments:

Post a Comment