Friday 11 September 2015

తెలుగు సంవత్సరములు వాటి ఫలితములు

తెలుగు సంవత్సరములు | వాటి ఫలితములు
1. ప్రభవ |యజ్ఞములు ఎక్కువగా జరుగును
2. విభవ | ప్రజలు సుఖంగా జీవించెదరు
3. శుక్ల |సర్వ శస్యములు సమృధిగా ఉండును
4. ప్రమోద్యూత |అందరికీ ఆనందానిచ్చును
5. ప్రజోత్పత్తి |అన్నిటిలోనూ అభివృద్ది
6. అంగీరస |భోగములు కలుగును
7. శ్రీముఖ |లోకములన్నీ సమృధ్దిగా ఉండును
8. భావ |ఉన్నత భావాలు కలిగించును
9. యువ|ఇంద్రుడు వర్షాలు కురిపించి సమృద్దిగా పండించును
10. ధాత |అన్ని ఓషధులు ఫలించును
11. ఈశ్వర |క్షేమము - అరోగ్యాన్నిచ్చును
12. బహుధాన్య |దెశము సుభీక్షముగా ఉండును
13. ప్రమాది |వర్షములు మధ్యస్తముగా కురియును
14. విక్రమ |సశ్యములు సమృద్దిగా పండును
15. వృష |వర్షములు సమృద్దిగా కురియును
16. చిత్రభాను |చిత్ర విచిత్ర అలంకారాలిచ్చును
17. స్వభాను |క్షేమము,ఆరోగ్యానిచ్చును
18. తారణ |మేఘములు సరైన సమయములో వర్షించి
సమృద్దిగా ఉండును
19. పార్ధివ |సంపదలు వృద్ది అగును
20. వ్యయ |అతి వృష్టి కలుగును
21. సర్వజిత్తు |ప్రజలు సంతోషించునట్టు వర్షాలు కురియును
22. సర్వధారి| సుభీక్షంగా ఉండును
23. విరోధి| మేఘములు హరించి వర్షములు లేకుండా చేయును
24. వికృతి| భయంకరంగా ఉండును
25. ఖర |పుషులు వీరులగుదురు
26. నందన |ప్రజలు ఆనందంతో ఉండును
27. విజయ |శత్రువులను సంహరించును
28. జయ |శత్రువులపైనా,రోగములపైనా విజయం సాధిస్తారు.
29. మన్మధ |జ్వరాది భాదలు తొలిగిపోవును
30. దుర్ముఖి |ప్రజలు దుఖర్మలు చేయువారగుదురు
31. హేవళంబి |ప్రజలు సంతోషంగా ఉండును
32. విళంబి |సుభీక్షముగా ఉండును
33. వికారి| శత్రువులకు చాలా కోపం కలింగించును
34. శార్వరి |అక్కడక్కడా సశ్యములు ఫలించును
35. ప్లవ |నీరు సమృద్దిగా ఫలించును
36. శుభకృతు |ప్రజలు సుఖంగా ఉండును
37. శోభకృతు| ప్రజలు సుఖంగా ఉండును
38. క్రోధి |కోప స్వభావం పెరుగును
39. విశ్వావసు| ధనం సమృద్దిగా ఉండును
40. పరాభవ |ప్రజలు పరాభవాలకు గురి అగుదురు
41. ప్లవంగ |నీరు సమృద్దిగా ఉండును
42. కీలక| సశ్యం సమృద్దిగా ఉండును
43. సౌమ్య |శుభములు కలుగును
44. సాధారణ |సామాన్య శుభాలు కలుగును
45. విరోధికృతు |ప్రజల్లో విరోధములు కలుగును
46. పరీధావి |ప్రజల్లో భయం కలిగించును
47. ప్రమాదీచ| ప్రామాదములు ఎక్కువగా కలుగును
48. ఆనంద |ఆనందము కలిగించును
49. రాక్షస |ప్రజలు కఠిణ హృదయిలై ఉండెదరు
50. నల |సశ్యం సమృద్దిగా ఉండును
51. పింగళ |సామాన్య శుభములు కలుగును
52. కాళయుక్తి |కాలయిక్తమయునది
53. సిద్ధార్ధి |అన్ని కార్యములు సిద్దించును
54. రౌద్రి |ప్రజలకు భాద కలిగించును
55. దుర్మతి |వర్షములు సామాన్యముగా ఉండును
56. దుందుభి |క్షేమము,ధాన్యాన్నిచ్చును
57. రుధిరోద్గారి |రక్త ధారలు ప్రవహించును
58. రక్తాక్షి |రక్త ధారలు ప్రవహించును
59. క్రోధన |జయమును కలిగించును
60. అక్షయ| లోకములో ధనం క్షీణించును

No comments:

Post a Comment