Saturday 12 September 2015

వెయ్యేళ్ళ క్రిందటి దేవాలయం బంగ్లాదేశ్ లో

బంగ్లాదేశ్లో వెలుగుచూసిన వెయ్యేళ్ల కిందటి హిందూ ఆలయం....!!!!!

పురావస్తు శాఖ అధికారులు బంగ్లాదేశ్లో వెయ్యేళ్ల కిందటి హిందూ దేవాలయాన్ని గుర్తించారు. బంగ్లాదేశ్లోని వాయువ్య ప్రాంతంలో దీనిని గుర్తించారు. దీనిని పాలరాజవంశం కాలంలో నిర్మించారని చెబుతున్నారు. దీనిని పాలరాజ వంశస్తులు నిర్మించారని చెబుతున్నారు. దినాజ్పూర్లోని బొచ్చగంజ్ ప్రాంతంలో ఈ దేవాలయాన్ని కనుగొన్నామని జహంగీర్ నగర్ వర్సిటీ ప్రొఫెసర్, పురావస్తు శాస్త్రవేత్త స్వాధీన్ సేన్ చెప్పారు. ఈ దేవాలయం గురించి మరిన్ని వివరాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ ఆలయాన్ని ఎనిమిది తొమ్మిదో సెంచరీ మధ్యలో నిర్మించి ఉంటారని ఆయన చెప్పారు. బొచ్చగంజ్ సబ్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం మెహెర్పూర్ గ్రామంగా పిలుస్తున్నారు. స్థానిక రైతులకు కొందరికి కొన్ని పురాతన వస్తువులు దొరికాయి. ఆ ప్రాంతం ప్రభుత్వం ఆధీనంలో ఉంది. రైతులకు పండించుకునేందుకు దానిని లీజుకు ఇచ్చింది. అయితే, తమకు పురాతన వస్తువులు దొరకడంతో రైతులు దానిని పురావస్తు శాఖ అధికారుల దృష్టికి తెచ్చారు.

తాము అక్కడ కొన్ని విగ్రహాలు, మెట్లు గుర్తించామని, మిగతా వివరాల కోసం తవ్వకాలు జరుపుతున్నామని మరో తవ్వకాలను పర్యవేక్షిస్తున్న సోహగ్ అలీ చెప్పారు. ఇటీవలే బుద్దిస్ట్ ఆలయాన్ని గుర్తించారు. బుద్దిస్ట్ ఆలయాన్ని గుర్తించిన రెండు మూడు నెలలకు ఇప్పుడు మరో హిందూ దేవాలయం వెలుగుచూసింది.

బంగ్లాదేశ్లో ఢాకేశ్వరి ఆలయం నేషనల్ టెంపుల్. ఇది అత్యంత ప్రాచీనమైన ఆలయం. దీనిని పన్నెండవ సెంచరీలో నిర్మించారు. బల్లాల సేన దీనిని నిర్మించారు. ఇతను సేన రాజవంశీయులు. పాలరాజవంశస్థుల తర్వాత సేనరాజులు పాలించారు. రాజధానిలో ఢాకేశ్వరి ఆలయం ఉండటం వల్లనే దానికి ఢాకా అని పేరు వచ్చినట్లు చెబుతారు.

No comments:

Post a Comment