Saturday 12 September 2015

ప్రణవ నాదము

1.ఈ భూమ్మీద మనుషులు పుట్టి 2 లక్షల
సంవత్సరాలే అయిందని పాఠ్యపుస్తకాల్లో
రాస్తారు కానీ కోట్ల సంవత్సరాల క్రితమే
మనుషులున్నారని నాసా రామాయణంలోని ఆధారాలని
నిరూపిస్తూ చెప్పింది కానీ మన విద్యలో
ఎటువంటి ఆధునికత చూపట్లేదు ఆధునికత
అంటే నిజాలను ఇప్పటి పధ్ధతి ప్రకారం
చెప్పడమా? నిజాలను దాచి ఉంచడమా?
2.రామాయణంలో అయినా, భాగవత భారతాల్లో అయినా
జంతువులు మాట్లాడతాయన్న కారణం చేత అవి
తప్పని కొట్టిపడేస్తారు కొందరు. కానీ, జపాన్ లో
ఒక కుక్క జపనీస్ మాట్లాడటం, అమెరికాలో మైక్ అనే
ఎలుక పాడటం
ప్రకృతి వింత కాదా? మీ దృష్టిలో. అవి ఏ
శాస్త్రీయ మార్పు ప్రకారం జరిగింది?
3.సనాతన ధర్మంలో పూర్వకాలం పరిస్థితి
చూసుకుంటే శూద్రులని బ్రాహ్మణులు
వెలివేసారు బ్రాహ్మణులని బ్రాహ్మణులు
వెలివేసిన పరిస్థితులున్నాయి
కొంతమంది బ్రాహ్మణులను క్షత్రియులు
వెలివేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి
కానీ ఎంతసేపూ బ్రాహ్మణులే శూద్రులని
వెలివేసారన్నట్టుగా చిత్రీకరించటం,
బ్రాహ్మణులు కష్టపడకుండా దేవుడి పేరున
ఊరికే వచ్చిన సొమ్ముని తింటారని సెటైర్లు
వేయడం ఎంతవరకు కరక్ట్? బ్రాహ్మణులు
అంటే ఊరికే వచ్చిన సొమ్ముని తినేవారే
కనపడతారు అందరికి కానీ బ్రాహ్మణుడిలో ఒక
వాల్మికి, అగస్త్యుడు, ఆర్యభట్ట, బోధిధర్మ,,
చాణక్యుడు వీరు కూడా ఉన్నారు వీరి జీవిత
చరిత్రలనే పూర్తిగా పాఠ్యాంశాలుగా పెడితే మన
యువత కూడా వారంత గొప్పవారు కారా?
అవుతారని తెలిసినా ఇలాంటి నిజాలని సమాజానికి
సగర్వంగా చెప్పరు. కారణం అది బ్రాహ్మణుల
చరిత్ర.అదేదో చిత్రంలో నిజం మరుగునపడ్డా
ఫర్వాలేదు నిజాయితి మరుగునపడకూడదు.
అని హీరో అంటాడు కానీ అలా మరుగునపడ్డ
ఒక్కొక్క నిజం వల్ల ఎందరి నిజాయితి మరుగున
పడుతుంది? ఇది ఎవ్వరాలోచించరా..?
4.ద్రవిడ భాషలుః- తమిల్, తెలుగు,
మలయాలం, కన్నడ
కానీ తమిల్ కంటే ముందే తెలుగు ఉంది
క్రీ.పూ.3000 క్రితమే తెలుగు ఉంది ఈ
విషయం అందరికి తెలిసి కూడా మనం తెలుగు
ప్రాచీనత్వాన్నీ, గొప్పతనాన్ని ఒప్పుకోము.
ఎందుకు?
5.ఒక మనిషి బొట్టు పెట్టుకోవడం వల్ల
అందునా కుంకుమ బొట్టు పెట్టుకోవడం
వల్ల జరిగే మంచేంటో తెలిసి కూడా
ఈ రోజుల్లో ఫ్యాషన్ పేరిట దాన్ని పాటించటం
లేదు
అసలు ఫ్యాషన్ ఉన్నది మనిషిని ఉన్నత స్థితికి
చేర్చటానికా?
అధోగతికా?
6.కొందరు నాస్తికులు దేవుడే లేడు అని
వాదిస్తారు వారికి కనువిప్పు కలిగించటానికి
చరిత్రలో ఉన్న శంకరులని, రామానుజులని,
శివాజీని, అన్నమయ్యని, రామదాసుని,
రామకృష్ణులని, వివేకానందులని,
అరబిందులని చూపిస్తే కొన్నిసార్లు చరిత్రలని
కూడా మారుస్తారని మూర్ఖవాదన చేస్తారు.
మీరు చరిత్రలనీ నమ్మక, ఇప్పటి పండితుల
మాట నమ్మక ఏం నమ్ముతారయా?
7.నాసావారు ఇటీవలే సూర్యుడిగొంతు ఓం
ఓం ఓం అంటుందని గుర్తించారు.
కొంతమంది మహానుభావులు శబ్దం నుండి
సృష్టి పుట్టడం ఏంటని దాన్ని
కొట్టిపడేస్తారు.
కానీ సృష్టిలో అణువణువునీ శాసించే
సూర్యుడు ఓం శబ్దాన్ని ఉఛ్ఛరిస్తున్నాడ
ంటే సూర్యుడికి కూడా ఒక పెద్ద ఉన్నట్టేగా?
ప్రణవనాదం సృష్టికి మూలము అనే కదా..
అర్థం?

No comments:

Post a Comment