Friday 11 September 2015

4.సూర్యుడు కేంద్రమా భూమి కేంద్రమా.??


4.సూర్యుడు కేంద్రమా - భూమి కేంద్రమా.??

గ్రహలన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతున్నవి అని కోపర్నికస్ 1453 వ సంవత్సరంలో పేర్కోని వివాదం రేకెత్తించాడు. ఈ సిద్దాంతం ‪#‎బైబిక్‬ కు వ్యతిరేకమని క్యాథలిక్ చర్చి అతనిని వలివేసింది.

తరువాత 1632 లో గెలీలియో ఈ సిద్దాంతాలను బలపరిచి ‪#‎చర్చీ‬ దృష్టిలో పాతకుడైనాడు.!

వేద విజ్ఞానం సూర్యుడే జగత్తని తన ఆకర్షణ శక్తితో పట్టి, అన్ని గ్రహలను నడిపించుచున్నాడు అని ఘోషించుచున్నది.

మిత్రో దాధార పృథవీముతద్యామ్ మిత్రః కృష్టీః॥
-కృష్ణ యజుర్వేదం - 3.4.11.16,
- ఋగ్వేదం - 3.5.59.1,

త్రినాభిచక్ర మజరమనర్వం యేనేనా విశ్వభువనాని తస్థుః॥
-ఋగ్వేదం - 1.1-164-1,
-యజర అరణ్యక 3.28 -అథర్వణవేదం - 9.9.1

"గ్రహలన్నీ అండాకార కక్ష్యలో నిరంతం పరిభ్రమించుగున్నవి" అని ఉన్నది.

ఆయంగౌః పృష్నిరకమీత్ అసదన్మాతరం పురః౹
పితరం చ ప్రయన్త్స్వః॥

-ఋగ్వేదం -10.189.1, -యజుర్వేదం -1.5.3.2,
-సామవేదం -630.2376 - అధర్వణవేదం - 6.32.1 లో

"భూమికి ఉపగ్రహం అయిన చంద్రుడు తన మాతృ గ్రహం 'భూమి ' చుట్టూ తిరుగుతున్నాడు. అలాగే భూమి కూడా తన పితృ గ్రహం అయిన స్వయం ప్రకాశకమైన సూర్యుని చుట్టూ తిరుగుతున్నది అని విలరింపబడి ఉంది.

ఒుుగ్వేదంలో 'ఐతరేత బ్రహ్మణ్యమ్' ( 14.6 ) ఇలా చెబుతూ ఉంది.
- సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నది. అందువల్లనే సూర్యుడు మనకు తూర్పున ఉదయించుచూ, పడమర వైపు అస్తమించుచున్నట్టగా కనిపిస్తూ ఉంటుంది. నిజానికి సూర్యుడు ఉదయించడు, అస్తమించడు"

ఇక ఆర్యభట్టుడు భూమి సూర్యని చుట్టూ తిరిగే విధానాన్ని 'లఘువు-గురువు న్యాయం' తో చక్కగా వర్ణించారు.
ఇక్కడ లఘువు అంటే తేలిక/చిన్న అని అర్ధం. గురువు అంటే ఘనమైన/ఆచార్యుడు అని అర్ధం. శాస్త్ర విషయాలలో నిపుణుడైన గురువు చుట్టూ శిష్యుడైన లఘువు తిరగడం లోక సహజం. ఆ విధంగా గురువు అయిన సూర్యుని చుట్టూ లఘువు/చిన్నది అయిన భూమి తిరుగుతున్నది అని అర్ధం. సూర్యుని నుంచి వెలుగు పొందుతూ "చంద్రుడు" ప్రకాశిస్తున్నాడని ఆర్యభట్టు, వరాహమిహిరుడు ఖచ్చితంగా చెప్పారు. భూమి తన కక్ష్యలో సూర్యుని చుట్టూ తిరుగుతున్నదని భూభ్రమణానికి 365 రోజుల సమయం పడుతుందనీ ఖచ్చితంగా గణించారు.

ప్రాచీనులు ఖగోళ గణనలో సూర్యుణ్ణి కూడా ఒక గ్రహంగా గణించారు. గ్రహగతులకు ఒక క్రమత్వం నిర్ణయించారు.అందువల్ల "భూకేంద్ర సిద్దాంతం" ప్రతిపాదించినట్టు కాదు. ఆర్యభట్టు,వరాహమిహురుడు తరువాతి కాలంనాటి భారతీయ ఖగోళ శాస్ర్తవేత్తలు తమ తమ గ్రంధాల్లో సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నది అన్న సిద్దాంతంతోనే ఖగోళ గణన చేసారు

No comments:

Post a Comment