Friday 11 September 2015

భారతీయ గొప్పతనం

ఒకసారి ఒక జపాన్ వాడు భారత దేశానికి సందర్శనానికి వచ్చాడు.తానూ వెళ్ళే చివరి రోజున,ఒక టాక్సీని ట్యాక్సీ నియమించుకొని విమానాశ్రయానికి తీసుకెళ్ళమని డ్రైవర్ ని అడిగాడు.
మార్గంలో, టయోటా కారు కనపడింది జపనీస్ వాడు ఇది ప్రపంచంలోనే చాల వేగంగా ప్రయానంచేసే కారు మా జపాన్ వాళ్ళు తాయారు చేసారు అని గొప్పలు చెప్పాడు. మరి కొంత దూరం వెళ్ళాక "మిత్సుబిషి" కారు వేగంగా వెళ్ళింది ., వెంటనే జపాన్ వాడు ఇది కూడా జపాను వారు తయారు చేసిన కారే అత్యంత వేగంగా ప్రయాణం చేస్తుంది అని మళ్ళి గొప్పలు చెప్పడం మొదలెట్టాడు. మార్గంలో పైన ఎగురుతున్న ఏరోప్లేన్ కనపడింది. జపాన్ వాడు మళ్ళి ఇది కూడా కనిపెట్టింది మా జపాన్ వాళ్ళే అని గొప్పలు చెప్పాడు. విని విని విసుగెత్తిన ఆ టాక్సీ డ్రైవర్ కోపం తగ్గించుకుంటూ విమానాశ్రయానికి తీసుకెళ్ళాడు.
కారు దిగిన జపాన్ వాడు ఎంత అయ్యింది అని అడిగాడు. టాక్సీ డ్రైవర్ 2000 రూపాయలు అని అంటాడు. జపనీస్ వాడు భయపడి "వాట్! అంత ఎక్కువ" అని గట్టిగా అడిగాడు.
టాక్సీ డ్రైవర్ :- "అవును సార్ , మా మీటర్ కూడా మీ జపాన్ వాడు చేసిందే. అందుకే చాల వేగంగా తిరుగుతుంది., ఇవ్వండి ఇవ్వండి 2000" అని గట్టిగా అడిగాడు. బిక్క మొహం వేసిన జపాన్ వాడు 2000రూపాయలు ఇచ్చాడు. ఆ టాక్సీ డ్రైవర్ వెనక్కి 1800 ఇచ్చేస్తూ మేము భారతీయులం సార్. మా వేదాలు మీ పాఠశాలలొ చదివిస్తూ మీరు విజ్ఞానం పొందుతూ అభివృద్ది చెందుతున్నారు. మేము మీ గొప్పలు వింటూ అసలైన మా ఖ్యాతిని గుర్తించలేక పోతున్నాం. అంతే సార్ అని డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయాడు.
మన నాగరికతలో నిగూఢంగా దాగున్న ఎన్నో విజ్ఞాన విషయాలు తెలుసుకొని మన దేశం కూడా అభివృద్ది చెందాలనే ఒక కోరికతో హాస్యాన్ని జోడిస్తూనే అసలు విషయాన్ని తెలియచేసే చిన్న ప్రయత్నం...
సో ఫ్రెండ్స్ మన విజ్ఞానం,తెలివితేటలు మనదేశానికి ఉపయోగపడితే ఇవన్నీ తప్పక సాధిస్తామని నా ఉద్దేశ్యం ,

No comments:

Post a Comment