Saturday 12 September 2015

ఆది శంకరాచార్యులు

హిందూ మతంపై శంకరుల ప్రభావం
అసమానమైనది. శంకరులు సాధించిన
ప్రధాన విజయాలు:
బౌద్ధమతం ప్రభావం వల్ల క్షీణించిన
హిందూ ధర్మాన్ని
పునరుద్ధరించడం. అయితే ఈ
ప్రక్రియలో (భౌతికంగా) ఏ విధమైన బల
ప్రయోగం లేదు. దేశదేశాలలో పండితులతో
వాదనలు సాగించి, వారిని ఒప్పించి, నెగ్గి,
శంకరులు తన సిద్ధాంతాన్ని వారిచే
మెప్పించాడు.
ఉపనిషత్తులకు, భగవద్గీతకు,
బ్రహ్మసూత్రాలకు, విష్ణు సహస్ర
నామాలకు భాష్యాలు వ్రాశారు. తరువాత
శంకరుల అనుసరించినవారికీ,
శంకరులతో విభేదించిన వారికీ కూడా ఇవి
మౌలిక వ్యాఖ్యా గ్రంథాలుగా
ఉపయుక్తమయ్యాయి.
శృంగేరి, ద్వారక, పూరి, జ్యోతిర్మఠం -
అనే నాలుగు మఠాలను స్థాపించినారు.
అవి శంకరుల సిద్ధాంతానికి, హిందూ
ధర్మానికి నాలుగు దిక్కులా దీపస్తంభాలలా
పనిచేశాయి.
గణేశ పంచరత్న స్తోత్రం, భజ గోవిందం,
లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం,
కనకథారా స్తోత్రం,శివానందలహరి,
సౌందర్యలహరి వంటి అనేక రచనలు
హిందువులకు నిత్య ప్రార్ధనా
స్తోత్రాలుగా ఈనాటికీ
ఉపయుక్తమవుతున్నాయి.
శ్రౌత,స్మార్త క్రియ ==
సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై
అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త
ఆది శంకరాచార్యులు, శంకర
భగవత్పాదులు అని కూడా పిలువబడి
హిందూమతాన్ని ఉద్ధరించిన
త్రిమతాచార్యులలో ప్రధములు.
గురువు, మహాకవి. శంకరులు
ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం
అంటారు. క్రీ.శ. 788 – 820 మధ్య
కాలంలో శంకరులు జీవించారని ఒక
అంచనా కాని ఈ విషయమై ఇతర
అభిప్రాయాలున్నాయి.శంకరులు
సాక్షాత్తు శివుని అవతారమని నమ్మకం
ఉంది.
దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే
స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య
నాయకః
దుష్టాచారములను నశింపచేయటానికి
కైవల్య నాయకుడైన శంకరుడే ఆది
శంకరుని రూపంలో అవతరించాడు. (-
శివరహస్యము నుండి).
కరిష్యత్స్యవతారం స్వం శంకరో
నీలలోహితః
శ్రౌత స్మార్త ప్రతిష్ఠార్థం భక్తానాం హిత
కామ్యాయా
శ్రౌత,స్మార్త క్రియలను సుప్రతిష్ఠితం
చేసి,వైదిక మార్గాన్ని సక్రమంగా
నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు)
స్వయంగా శంకరుల రూపంలో
అవతరించారు. (కూర్మపురాణం
నుండి).

No comments:

Post a Comment