Sunday 20 September 2015

జగత్తు పదార్ధం శక్తి

జగత్తు - పదార్ధం - శక్తి :-
ఐన్‌స్టీన్ సిద్ధాంతం ప్రకారం శూన్యాకాశం నుండి కాలాన్ని వేరుచేయలేము. కనుక బృహత్తరమైన వస్తువుల సమక్షంలో శూన్యాకాశం వంపు చెందడమే కాక కాలగతి కూడా మారుతుంది.
దేశ కాలాలు (space-time) పరిశీలకుడు ప్రకృతి క్రియను వర్ణించే భాషలొని అంశాలు మాత్రమే.
అందువల్ల ద్రవ్యరాశిత్వం కూడా శక్తి యొక్క రూపమే. స్థిరంగా ఉన్న వస్తువులోని శక్తి దాని ద్రవ్యరాశి రూపంలో ఉంటుంది. ఆ వస్తువు కాంతి వేగంతో ప్రయాణిస్తే అది కాంతి అనే శక్తి రూపం ధరించి, దాని ద్రవ్యరాశిత్వం నశిస్తుందని తేలింది.
పదార్ధం అస్థిరమైందనీ, అంటే సృష్టి వినాశనాలు కలదనీ ఋజువైంది.
సాంప్రదాయక సిద్ధాంతంలోని ప్రాధమిక కణము, భౌతిక పదార్ధము, విడిగా ఉన్న వస్తువులు – మొదలైన భావాలు వాస్తవం కాదనీ, ఈ విశ్వమంతా విడదీయనలవికాని శక్తి వలయాల క్రియాత్మకమైన కూర్పనీ ఋజువైంది. పరిశీలకుడు కూడా దీని నుండి విడదీయడానికి వీలుకాని రీతిన ఇమిడి ఉన్నాడనీ ఋజువైంది.
ఇవన్నీ సాపేక్ష సిద్ధాంతంలోవే.
అద్వైత సిద్ధాంతం చెప్పిన - జగత్తు మిధ్య అనే భావంతో ఇది సరిపోతోంది. అంటే అసలైన వస్తువు అని చెప్పదగింది ఎదీ ఈ విశ్వంలో లేదు. ఉన్నదంతా శక్తిరూపమే.
సైన్స్ ఇంతవరకూ ప్రాధమిక కణం అంటే ఏమిటో నిర్ధారించలేకపోయింది.
కణాలు పదార్ధంతో చేయబడి ఉండనక్కర్లేదనీ, శక్తియే ద్రవ్యరాశిత్వం గల కణాలుగా ప్రవర్తిస్తుందనీ నేటి భౌతిక శాస్త్రం కనుగొన్నది.
పదార్ధమనేది వ్యవహార సౌలభ్యం కోసం సృష్టి గురించి మనమేర్పరుచుకున్న భావం మాత్రమే గాని తత్వతః వాస్తవం కాదు.
"బ్రహ్మమే జీవితం. బ్రహ్మమే అనందం. బ్రహ్మమే శూన్యం... ఆనందం, శూన్యమూ ఒక్కటే" - ఛాందోగ్యోపనిషత్తు.

No comments:

Post a Comment