Saturday 12 September 2015

భారత్ మాతా కీ జై

మేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిని
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము
ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగబలమో
జనియించినాడ ఏ స్వర్గఖండమున
ఏమంచి పూవులన్ ప్రేమించినావో
నిను మోసే ఈ తల్లి కనక గర్భమున
లేదురా ఇటువంటి భూదేవి యెందు
లేరురా మనవంటి పౌరులింకెందు
సూర్యుని వెలుతురుల్ సోకునందాక
ఓడల జెండాలు ఆడునందాక.
అందాకగల ఈ అనంత భూతలిని
మన భూమి వంటి చల్లని తల్లి లేదు
పాడరా నీ తెలుగు బాలగీతములు
పాడరా నీ వీర భావ భారతము.
తమ తపస్సులు ఋషులు ధారవోయంగ
శౌర్యహారము రాజచంద్రులర్పింప
భావ సూత్రము కవిప్రభువు లల్ల్లంగ
రా దుగ్ధము భక్తరత్నముల్ పిదుక.
దిక్కుల కెగదన్ను తేజమ్మువెలుగ
రాళ్ళ తేనియలూరు రాగాలు సాగ
జగముల నూగించు మగతనం బెగయ
సౌందర్యమెగ బోయు సాహిత్యమలర
వెలిగినదీ దివ్యవిశ్వంబు పుత్ర
దీవించె నీ పుణ్యదేశంబు పుత్ర
పొలముల రత్నాలు మొలిచెరా యిచట
వార్ధిలో ముత్యాలు పండేరా యిచట.
పృధివి దివ్యౌషధుల్ పిదికెరా మనకు
కానల కస్తూరి కాచెరా మనకు
అవమానమేలరా? అనుమానమేల?
భారతీయుడనంచు భక్తితో పాడ.

No comments:

Post a Comment