Saturday 12 September 2015

భోజనం చేసేటప్పుడు ముందుగా

భోజనం చేయునపుడు
ముందుగా కాళ్లూ,చేతులు, నోరు
శుభ్రపరచుకొని బోజనమునకు కూర్చొన
వలెను. భగవంతుని స్మరించవలెను.
శ్లో: బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ బ్రహ్మాగ్నౌ
బ్రహ్మణా హుతం
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ
సమాధినా .
శ్లో:అన్న పూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణ
వల్లభే
ఙాన వైరాగ్య సిధ్యర్థం భిక్షాం దేహీచ పార్వతీ.
శ్లో: అహం వైస్వానరో భూత్వా ప్రాణినాం
దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం
చతుర్విధం.
ఓం నమో నారాయణాయ.
ఔపోశనము ( భోజనమునకు ముందు )
ఓ భూర్భువస్సువః. తత్సవితుర్వరేణ్యం.
భర్గోదేవస్య ధీమహి. ధియో యోనః ప్రచోదయాత్.
అని గాయత్రీ మంత్రమును చదువుతూ
నీటిని అన్న పదార్థములపై చల్లాలి. తద్వారా ఆ
పదార్థమును ఆవహించి యున్న
భూతములు తొలగి పోతాయి. తరువాత ఎడమచేతి
మధ్యవేలును విస్తరాకు పై ఆనించ వలెను.
సత్యంత్వర్తేన పరిషించామి
( సూర్యాస్తమయము తరువాత అయితే -
ఋత్వంత్వా సత్యేన పరిషించామి ) అని చెప్పి
నీటిని అన్నము చుట్టూ సవ్యముగా
పొయ్యాలి. తరువాత భోజన పాత్రకు దక్షిణముగా
నిరు చల్లి కొద్దికొద్దిగా అన్నము తీసుకోని
ధర్మ రాజాయ నమః
చిత్రగుప్తాయ నమః
ప్రేతెభ్యో నమః
అనుచు బలులను తూర్పు అంతముగా
సమర్పించవలెను.
అరచేతిలో నీటిని తీసుకోని అమృతమస్తు. అని
అన్నమును అభిమంత్రించ వలెను.
అమృతోపస్తరణమసి స్వాహా అని నీటిని తాగాలి.
కుడిచేతి బొటన వేలు మధ్య, ఉంగరం వేళ్లతో
అన్నమును కొద్ది కొద్దిగా తీసుకుని క్రింది
మంత్రమును చెప్తూ పంటికి తగుల
కుండ మ్రింగ వలెను.
ఓం ప్రాణాయ స్వాహా.
ఓం అపానాయ స్వాహా.
ఓం వ్యానాయ స్వాహా.
ఓం ఉదానాయ స్వాహా.
ఓం సమానాయ స్వాహా.
ఓం బ్రహ్మణే స్వాహా.
మనకు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములని
పంచప్రాణములు కలవు. ఆ పంచ
ప్రాణాత్మకమైన అగ్నికి ఆహుతులను
సమర్పించుట ఇందు ఉన్న అంతరార్థము.
పంటికి తగిలితే అది ఎంగిలి అవుతుంది.
తరువాత ఎడమచేతిని ప్రక్కన ఉన్న నీటితో కొద్దిగా
తడిచేసుకుని శుభ్రపరచుకుని భోజనమును
ముగించవలెను.
ఉత్తర ఔపోశనము ( భోజనము తరువాత )
నీటిని కుడి చేతిలొపోసుకుని అమృతాపిధానమసి.
అని కొద్దిగా తాగి మిగిలిన నీటిని క్రింది
మంత్రమును చదువుతూ అపసవ్యముగా
ఉచ్ఛిష్ట అన్నము ( విస్తరాకు ) చుట్టూ
పొయ్యవలెను.
రౌరవే2పుణ్యనిలయే పద్మార్బుద నివాసినాం
అర్థినాముదకందత్తం
అక్షయ్యముపతిష్ఠతు.
అనంతరము కాళ్లూ , చేతులు, నోరు
శుభ్రపరచుకొని ఆచమనము చేయ
వలెను.రెండు చేతులను గట్టిగా రాపిడి చేసి
రెండు కళ్లను తుడుచు కొన వలెను.
ఈరకముగా మూడు సార్లు చేయవలెను. తద్వారా
కంటి దోషాలు తొలగి పోతాయి.
తతః శత పదాని గత్వా - వంద అడుగులు
వేయవలెను. తరువాత
అగస్తిరగ్నిర్ బడబానలశ్చ భుక్తం మయాన్నం
జరయంత్వశేషమ్.
సుఖం మమైతత్ పరిణామ సంభవం యచ్చ
త్వరోగోర మమచాస్తు దేహః.
అంటూ పొట్టను ముమ్మారు నిమర
వలయును. తద్వారా ఆహారము చక్కగా
జీర్ణమగును.

No comments:

Post a Comment