Monday 14 September 2015

స్వామీ వివేకానంద

విశ్వమత మహాసభలో ''అమెరికా సోదర
సోదరిమనులారా ! అన్న ఆత్మీయ సంబోదనతో విశ్వ
వేదిక పై స్వామి వివేకానంద ప్రప్రదమంగా అడుగు
పెట్టారు .అక్కడకు వచ్చిన ఆరువేలమంది శ్రోతలు ఈ
ఐదు మాటల సంబోదనతో 5 నిమిషాలు కరతాళ ధ్వనులతో
మారుమోగించడం జరిగింది.ఒక నవీన మత ప్రవక్త
వుద్బవిన్చాడని తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు...ఆ
ప్రసంగం లో అమెరికా దేశాస్తులను ఉద్దేశిస్తూ ''ప్రపంచం
లో అత్యంత ప్రాచీన యతి సంప్రదాయం పేర ;సమస్త
మతాలకు ,సమస్త ధర్మాలకు తల్లి అనదగ్గ
సనాతన దర్మం పేర ; నానా జాతులతో ,నానా
సంప్రదాయాలతో కూడిన భారత జన సహస్రాల పేరిట
మీకు నా అబివాదాలు ''
హిందూ మతం సర్వాన్ని తనలో ఇముడ్చుకునే తత్త్వం
కలిగి వున్నదని తెలిపాక అయన ఇలా ప్రకటించారు '' ఈ
ఆదునిక వైజ్ఞానిక ఆవిష్కరణలు ఎ అతున్నత వేదాంత
సత్యాల నిమ్న ప్రతి బింబాలో దాని మొదలు అతి
ప్రాదమిక స్తాయి గా బావించే విగ్రహారాదన ,రకరకాల
పురాణ గాధలు బౌద్దుల అజ్ఞేయవాదం ,జైనుల
నాస్తికత్వం --ఇవ్వన్ని హిందూమతం లో సముచిత స్తానం
ఇచ్చి చేర్చుకోబడ్డాయి .'' తన చికాగో ప్రసంగం లో వివిధ
మత శాఖల అనుయులను ఎకీకకరణం చేసే నవీన
సిద్దాంతాలు స్వామి ప్రతిపాదించారు.
విశ్వమత మహా సభలో అందరికి అబిమాన వక్త
అయ్యారు ఎవరైనా రణగొణ ధ్వనులు సృష్టిస్తూ
మాట్లాడితే శ్రితాలను ఉత్తేజం చేయడానికి ...తరువాత
స్వామి వివేకానంద ప్రసంగం వుందని ప్రకటించే వారు .
''ఇది స్వామి జీవిత చరిత్ర నుండి సెకరించనైనది''

No comments:

Post a Comment