Friday 11 September 2015

హిందూ పద వివరణ మన సంస్కృతులలో

హిందు పదం సంస్కృత
వాజ్ఞ్మయంలో లేదని చాలా కాలం వరకు
అనేకులు వాదిస్తూ వచ్చారు. కానీ సంస్కృత
భాషలో రాసిన దాదాపు 15 పురాతన గ్రంధాల్లో
హిందు పదం ప్రయోగించబడింది. క్రీ.శ.4-6
శతాబ్దాల మధ్యలో శైవ సప్రదాయానికి చెదిన మేరు
తంత్రం అనే గ్రంధంలో హిందు పదం
కనిపిస్తుంది.
శబ్దకల్పధ్రుమ అనే గ్రంధంలో కూడా
హిందు పదం ఉంది. రెండు గ్రంధాలు
హిందు అంటే అల్పమైన, నీచమైన,
క్షుద్రమైన, తుచ్ఛమైన వాటిని
త్యజించేవాడు అని అర్దాలు చెప్తున్నాయి.
బృహస్పతి ఆగం అనే గ్రంధం
హిమాలయస్య సమారంభ్య యావదిందు
సరోవరం
తస్యదేవ నిర్మితం దేశం హిందుస్థానం
ప్రశశ్తయత్
అని చెప్పింది. హిమాలయల నుంచి ఇందు
సరోవరం (హిందూ మహాసముద్రం) వరకు
ఉన్న ప్రదేశమంతా దేవతల చేత ప్రత్యేకంగా
నిర్మితమైందని, అందువల్ల ఇది దేవభూమి
అని, దీనికి హిందుస్థానమని పేరు అని
చెప్తోంది.
మంగళ్ నాధ్జి అనే స్వామిజీకి బృహన్నరది అనే
ఒక పురాతన గ్రంధం పంజాబ్లోని
హోషియార్పూర్ దగ్గరలో షాంపూర్ అనే
ప్రానతంలో లభ్యమైంది. దాని ప్రకారం
హిమాలయాల్లో 'హిం' అనే ధాతువును,
ఇందుసరోవరంలో 'ందు' అను ధాతువును
కలిపి, ఈ భూమికి హిందుస్థానమని పేరు
వచ్చిందని పేర్కొంటోంది.
హిమాలాయలంత ఉన్నతమైన విలువలు,
ఆశయాలు, సముద్రమంత లోతుగా అందరిని,
అన్నిటిని అర్దం చేసుకునే మనస్తత్వం
ఉన్నవారు హిందువులు అని అర్దం.

No comments:

Post a Comment