Saturday 12 September 2015

తల్లిదండ్రులను గౌరవించండి

దేవుడు మనకు జన్మనివ్వడమే అతి పెద్ద వరం.
జన్మనిచ్చి మనకు తల్లిదండ్రులను ప్రసాదించడం ఇంకా పెద్దవరం
కానీ
మీరు ఏం చేస్తున్నారు.
మీ తల్లితండ్రులు
నీ కోసం ఎండనకా,వాననకా శ్రమించి
కని
పెంచి
ఇంత పెద్దవాడిని చేస్తే
వేరు పెద్దయ్యాక నా కొడుకు నన్ను చూస్తాడనుకుంటే
నీకు ఒక తోడు కావాలని
ఊరంత పందిరి
ఆకాశమంత పెళ్ళిమండపం కట్టి
నీ పెళ్ళి చేస్తే
నీవు పెళ్ళాం వ్యామోహంలో పడి
నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను
ఇలా వదిలేయడం నీకు బావ్యమా.??
ఎలా మనసు మస్తుంది మీకు
మూడు పూటల అన్నం పెట్టలేని పరిస్థితిలో ఉన్నారా.??
నవ మాసాలు నీ తల్లి నిన్ను మోసింది ఇందుకా
నడక నేర్పిన నీ తండ్రి నీకు ఇందుకా
ఇలా చేస్తరని వాళ్ళకి అప్పుడే
తెలుసుంటే
మీ పీక పిసికేసేవారేమో
ఒక్కసారి
అలా రైల్వేస్టేషన్లలో, బస్ట్ స్టాండ్ లలో
వదిలివెళ్ళిన తల్లిదండ్రుల
పరిస్థితిలో మీరు ఉండండి
గుండె ఎంత బాధపడుతుందో తెలుసా.??
రేపు మీరు ముసలివారయ్యాక
నీ కొడుకులు అలాగే చేస్తే
తట్టుకోగలవా
దయచేసి
ఇలా వారిని ఒంటరి వాళ్ళను చెయ్యకండి
తల్లిదండ్రులకు సేవ చెయ్యకపోయినా పరవాలేదు
ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టండి చాలు.!!
  

No comments:

Post a Comment