Friday 11 September 2015

వేదాలకు పేర్లు

వేదాలకు పేర్లు
వేదాలకు (1). శ్రుతి, (2). అనుశ్రవం, (3).
త్రయి, (4). సమమ్నాయము, (5). నిగమము,
(6). ఆమ్నాయము, (7). స్వాధ్యాయం, (8).
ఆగమం, (9). నిగమం అని తొమ్మిది
పేర్లున్నాయి.
1. శ్రుతి - గురువు ఉచ్చరించినదాన్ని విని
అదేవిధముగా శిష్యుడు ఉచ్చరిస్తూ
నేర్చుకుంటాడు.
2. అనుశ్రవం - గురువు
ఉచ్చరించినదాన్ని సరిగా తిరిగి అదేవిధముగా
శిష్యుడు ఉచ్చరిస్తూ ఉంటాడు.
3. త్రయి - ఋగ్వేదము, యజుర్వేదము
మరియు సామవేదములను కలిపి "త్రయి" అని
పేరు.
4. సమమ్నాయము - ఎల్లప్పుడూ
అభ్యసింపబడునవి.
5. నిగమము - భగవంతుని నిశ్వాస
రూపములో బయలు పడేవి. యాస్కుడు
నిగమము అని వీటిని వ్యవహరించాడు.
6. ఆమ్నాయము - ఆవృత్తి లేదా మననం
ద్వారా నేర్చుకోబడే విద్య.
7. స్వాధ్యాయం - స్వాధ్యాయం అంటే--స్వ
అధ్యయనం అంటే మనల్ని మనం
విశ్లేషించుకోవడం
8. ఆగమం - భగవంతుని నిశ్వాస
రూపములో బయలు పడేవి.
9. నిగమం - యాస్కుడు నిగమము అని
వ్యవహరించాడు.

No comments:

Post a Comment