Saturday 12 September 2015

గోదావరీ సమీపంలో శక్తి పీఠాలు

గోదావరి నది సమీపంలోని శక్తి పీఠాలు = పురూహుతిక
కుక్కుటేశ్వర స్వామి ఆలయం, పిఠాపురం= మాణిక్యాంబ,
శ్రీ భీమేశ్వరస్వామి ఆలయం, ద్రాక్షారామం= శ్రీ
దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం, విజయవాడ =
పురూహుతిక కుక్కుటేశ్వర స్వామి ఆలయం, పిఠాపురం
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో పురూహుతికా
కుక్కుటేశ్వరస్వామి ఆలయం నెలకొని ఉంది.
కుక్కుటేశ్వర స్వామి దేవాలయం కోనేరుకు ముందు
తూర్పుముఖంగా ఉంటుంది. దేవాలయం ఎదురుగా కల ఏకశిల
నంది అతి పెద్దగా శ్రీశైల నందిని పోలి ఉంటుంది.
కుక్కుటేశ్వర లింగం తెల్లగా గర్భాలయంలో కొద్దిగా
దిగువగా ఉంటుంది. ఈ ఆలయానికి రెండు వైపులా
పురూహూతికా అమ్మవారి ఆలయం, శ్రీపాదుల
ఆలయాలు ఉన్నాయి. కుక్కుటేశ్వరస్వామి ఆలయ
సముదాయంలో పురుహూతికా దేవి ఆలయం ఉంది. ఇది
అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. భారతదేశం లోని
అష్టాదశ మహా శక్తి పీఠములలో ఒకటైన హుంకారిణీ
శక్తి పీఠం ఈ కుక్కుటేశ్వరుడి దేవళంలో ఉండేది.
పుస్తకాలలో, పురాణాలలో కల ఈ పీఠం కాని, ఆ శక్తి
విగ్రహం కాని ప్రస్తుతం కానరావు. ఈ పీఠం మూలంగానే
పిఠాపురానికి పీఠికాపురం అనే పేరు వచ్చిందని అంటారు.
ఈ హుంకారిణీ శక్తి విగ్రహం రైల్వే స్టేషను కి
ఎదురుగా ఉన్న మట్టి దిబ్బలో భూస్థాపితమై
ఉందంటారు. మహా శివరాత్రి, శరన్నవరాత్రి, కార్తీక
మాసం వేడుకలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు.
మాణిక్యాంబ, శ్రీ భీమేశ్వరస్వామి ఆలయం,
ద్రాక్షారామం
ద్రాక్షారామంలో గల శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ
భీమేశ్వర స్వామి వార్ల దేవాలయం అతి ప్రాచీన
సుప్రసిద్ధ శైవ క్షేత్రం. ఈ ఆలయాన్ని క్రీ.శ.
7,8 శతాబ్ధాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి
చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్టుగా శాసనాల
ద్వారా తెలుస్తొంది. ఇక్కడి మూలవిరాట్ శ్రీ భీమేశ్వర
స్వామి స్వయంభుగా వెలసిన 14 అడుగుల శివలింగం,
శుద్ధ స్ఫటికాకార లింగం. ఈయన దేవేరి శ్రీ
మాణిక్యంబా అమ్మవారు యావత్భారత దేశంలోనే
ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక్తి పీఠాలలో 12 వ
శక్తిపీఠంగా వెలసి ఉంది. త్రిలింగ క్షేత్రాలలో
ఒకటిగా, అష్తాదశ శక్తిపీఠాలలో ద్వాదశ పీఠంగా,
దక్షిణ కాశీగా, వ్యాస కాశీగా ద్రాక్షారామానికి
ప్రశస్తి ఉంది. శిల్ప కళాభిరామమై, శాసనాల
భాండాగారమై ద్రాక్షారామ భీమేశ్వరస్వామి ఆలయం
అలరారుతోంది. శాతవాహన రాజైన హాలుని కాలానికే ఈ
ఆలయం ఉన్నట్లు లీలావతీ గ్రంథం అన్న
ప్రాకృతభాషా కావ్యంలో పేర్కొన్నారు. ఈ ఆలయాన్ని,
సామర్లకోట లోని భీమేశ్వరాలయాన్ని కూడా చాళుక్య
రాజయిన భీముడు నిర్మించాడని చెబుతారు. అందుకే ఈ
రెండు గుడులు ఒకే రీతిగా ఉండటమేగాక, రెంటి
నిర్మాణానికి ఉపయోగించిన రాయికూడ ఒకేరకంగా
ఉంటుంది.
శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం,
విజయవాడ
అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల
మూలపుటమ్మ
చాల పెద్దమ్మ సురారులమ్మ కడు పాఱడిపుచ్చి
నయమ్మ తన్నులో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల
నుండెడియమ్మ
దుర్గ మాయమ్మ కృపాబ్ది యిచ్చుత మహత్వ
కవిత్వ పటుత్వ సంపదల్.
విజయవాడ పేరు చెప్పగానే కనకదుర్గ ఆలయం
మనకు గుర్తుకొస్తుంది. హిందూ పురాణాలలో అమ్మవారి
గురించి ప్రస్తావన ఉంది. ఆలయంలో అమ్మవారి
విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది.
మిరిమిట్లు గొలిపే ఆభరణాలు, పూలతో అలంకరించబడి
ఉంటుంది. విగ్రహానికి ఎనిమిది చేతులు ఉన్నాయి.
ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. త్రిశూలం తో
మహిషాసురుని గుండెలో పొడుస్తున్న భంగిమ లో ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ లో వేంకటేశ్వరస్వామి గుడి తర్వాత
అత్యంత జనాకర్షణ కలిగిన ఆలయం. దక్షిణ
భారతదేశంలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా
అఖిలాంధ్రకోటి బ్రహ్మాండాలను కాపాడుతోంది. భక్తుల
కోరికలు తీరుస్తున్న అమ్మలగన్న అమ్మ
ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆదిపరాశక్తి
కనకదుర్గమ్మ. ఇక్కడ అమ్మవారు స్వయంభువుగా
వెలసిందని పురాణాలు చెబుతున్నాయి.అంతేకాక శ్రీ శక్తి
పీఠాల్లో ఈ ఆలయం ఒకటి.
ఆలయ చరిత్ర
దుర్గాదేవి గుడి బంగారు శిఖరంతో అత్యంత
శోభాయమానంగా ఉంటుంది. కనకదుర్గమ్మకు సంబంధించి
మూడు కథలు ప్రచారంలో ఉన్నాయి. మొదటిది
ఇంద్రకీలుని కథ, రెండోది అర్జుని కథ, మూడోది
మాధవవర్మ కథ. ఇంద్రకీలుని కథ ప్రకారం
ఇంద్రకీలుడు జగన్మాత భక్తుడు. అతను చిరకాలం
భక్తితో అమ్మవారిని ఆరాధించి దుర్గాదేవి దర్శనం
పొందాడు. అమ్మవారు ఎల్లప్పుడు తన వద్దనే
ఉండాలని వరంకోరుకున్నాడు. అప్పుడు అమ్మవారు
తర్వాత జన్మలో నీవు కొండ రూపం ధరిస్తావని, ఆ
కొండమీద తను మహాలక్ష్మి రూపంలో అవతరిస్తానని
వరమిచ్చింది. పాండవమధ్యముడు అయిన
అర్జునుడు అరణ్యవాస సమయంలో తన అన్న
ధర్మరాజు ఆజ్ఞమీద ఇంద్రకీలాద్రి మీద ఇంద్రుని
కొరకు తపస్సు చేసాడు. అప్పుడు ఇంద్రుడు
ప్రత్యక్షమై శివమంత్రం ఉపదేశించి,
పాశుపతాస్త్రం కొరకు శివుని ఆరాధించమని చెప్తాడు.
అలా అర్జునుడు తపస్సు చేస్తున్నప్పుడు, ఒకానొక
రోజు అతి భయంకరమైన పెద్ద పంది ఒకటి వచ్చి
తపస్సుకి భంగం కలిగించసాగింది. తపోభంగమైన
అర్జునుడు దాన్ని వేటాడసాగాడు. కాని అది చాలా చురుకుగా
బాణాలనుంచి తప్పించుకొని పారిపోయింది. ఎట్టకేలకు
అర్జునుడు గురిచూసి దాని

No comments:

Post a Comment