Friday 11 September 2015

5.సప్తవర్ణం భానుకిరణం


5.సప్త వర్ణం - భానుకిరణం

సూర్యుని నుండి వెలువడే కాంతి కిరణాలలో ఏడు రంగులు ఉన్నాయి అనే విషయాన్నీ ప్రపంచానికి తెలియచెప్పింది 16వ శతాబ్దం కి చెందిన వాడైన న్యూటన్ మహాశేయుడేనని నేడు పాశ్యాత్తులు ( మనం కూడా ) అంటున్నాం.!

ఈ విషయం లో భారతీయులు ఎంతో ముందున్నారు. ప్రపంచంలో అతి పురాతనమైన వేదవిజ్ఞానంలోనే సూర్యకిరణాలలో ఏడు రంగులున్నాయ్ అని చక్కగా వివరింపబడింది.

దుం॥ సప్త త్వా హరితో రథే వహన్తి దేవ సూర్య౹ శోచిష్కేశం విచక్షణః౹"
- ( ఋ. 1-50-9 ).
దుం॥ అవ దివస్తారయన్తి సప్త సూర్యస్య రశ్మయః॥"
- ( అథర్వ 17-10-17-1 )

సూర్యుని ఏడు కిరణాలు దినాన్ని ఉత్పన్నం చేయుచున్నవి అని దీని అర్ధం.

సూర్యునికి ఖచ్చితంగా ఏడు కిరణములే ఉంటాయా.?!
కాదు, సహస్ర సహస్ర కిరణాలలో ప్రతి కిరణంలోనూ తిరిగి ఏడు వర్ణములుంటాయని దీని భావం.
‪#‎సప్తాశ్వరూడూ‬ అనగా ……… అర్ధమిదే.
అలాగే సూర్యణ్ణి ఒక గుర్రమే తీసుకు వెళ్తున్నది. అని కూడా మన వేదంలో ఉన్నది. అనగా సప్తవర్ణ సమ్మిళితమైన తెల్లని కాంతి కిరణం అని అర్ధం.

‪#‎అశ్వ‬ అంటే కిరణం అని కూడా అర్దం ఉంది
"తైతరీయ అరణ్యకం" లో
'ఏకో అశ్వోవాహతి సప్తనామ'
( ఋ 1-164-2 ) అని చక్కగా వివరింపబడి ఉంది. సూర్యని కిరణాలలో పలు రంగులు దాగి ఉన్నాయి. అని అందరికంటే ముందుగా మనకు తెలుసు అనడానికి ఇక వేరే ఋజువులు కావాలా.!!

ఇంకో అద్బుత విషయం ఏమనగా ఛాందోగ్య ఉపనిషత్తులో ( ఛాందోగ్య -8-6-1) సూర్యకిరణంలో మూడు రంగులు ఉన్నాయని
అవి
1.నీలం
2.పసుపు
3.ఎరుపుగా వివరింపబడింది.
ఇదికూడా నిజమే.
నిజానికీ మూడు రంగుల కలయికతోనే మరిన్ని రంగులు ( ఏడు ) ఉధ్భవించుచున్నవి.!!

No comments:

Post a Comment