విదేశాలలో భారతీయ సంస్కృతి .......
భారతీయ సంస్కృతి ప్రంపంచంలోని అనేక దేశాల్లో వ్యాపించింది.
భారతీయ ఆచారాలు, నాగరికతకు ఆయా దేశాలు పట్టం కట్టాయనే చెప్పవచ్చు.
బర్మా దేశాన్ని పూర్వం సువర్ణభూమి అని పిలిచేవారు. ఇక్కడి శిల్పాల్లో బౌద్ధ,శైవ,వైష్ణవ ప్రతిమలున్నాయి. వీరి న్యాయ శాస్త్రం నారద,మనువు, యాగ్నవల్క్య బోధనల ఆధారంగా వెలిసింది.
ఇండోనెషియాలోని జావా ద్వీపంలో లభించిన శాసనాలు సంస్కృతంలో దేవనాగరి లిపిలో ఉన్నవి. అంతేకాదు,,బేయాన్ నగరంలో ఉన్న ఎనిమిది దేవాలయాలలో విష్ణు,శివ,గణేష,దుర్గ,యమ విగ్రహాలున్నవి.
అమెరికా ఖండంలోని మెక్సికో దేశంలో హిందూ నాగరికత విలసిల్లింది. ఇక్కడ ఒక సూర్య దేవాలయమున్నది. అంతేకాదు.. ఇక్కడే గణేష ప్రతిమలు లభించాయి.
అఫ్ఘనిస్తాన్కి పూర్వం గాంధార దేశమని పేరు. గజినీ నగరంలో జరిగిన తవ్వకాలలో విష్ణు విగ్రహాలు బయటపడ్డాయి.ఇక్కడి ప్రజలు మాట్లాడే పుస్తూ భాషలో అనేక సంస్కృత పదాలున్నాయి.
జపాన్ లోని కియాటో నగరంలో యముని దేవాలయమున్నది.దున్నపోతునెక్కిన యముణ్ణి ఇక్కడ చూడవచు.ఈ ప్రాంతం వారు యముణ్ణి యెమ్మాశ్వాన్ అని పిలుస్తారు.
హిందూ సంప్రదాయానికి అలవాలంగా ప్రసిద్ది చెందిన ఇండస్ నది ఒడ్డున ఏళ్ల నాటి పురాతన వస్తువులు తరచూ బయటపడుతూనే వున్నాయి
. పంజాబ్, సింగ్ మీదుగా ప్రవహించిన ఇండస్ నది పరివాహిక ప్రాంతంలో చారిత్రాక పట్టణాలైన మహెనజో ధారో, హరప్పలు వున్నాయి.
పాకిస్థాన్ అక్రమిత పంజాబ్ రాష్ట్రంలోని హరప్పలో అత్యంత పురాతనమైన మూడు శివలింగాలను పురావస్తుశాఖ అధికారులు కనుగోన్నారు. ఇవి సుమారు 5000 ఏళ్ల క్రితానికి చెందిన శివలింగాలుగా వారు కనుగోన్నారు.
1940లోనే అప్పటి పురావస్తు శాస్త్రవేత ఈ మూడు శివలింగాలను కనుగోన్నారు. అత్యంత పురాతన కాలానికి చెందిన ఈ శివలింగాలను హరప్ప పట్టణం నుంచి వారు వెలికితీశారు. ఇటీవల హరప్పలో అత్యంత పురాతనమైన దిగుడు బావిని కూడా పురావస్తు శాఖ అధికారులు కనుగొన్నారు.
ఇప్పటి వరకు అత్యంత లోతైన దిగుడు బావి మహెనజదారో పట్టణంలోనిదా చరిత్రకెక్కగా. తాజాగా హరప్పలో బయటపడిన పురాతన బావి దీర్ఘచతురస్రాకారంలో 73 మీటర్ల పోడవునా, 29 మీటర్ల వెడల్పుతో 10 మీటర్ల లోతుగా నిర్మించివుంది.
No comments:
Post a Comment