Friday 11 September 2015

విఘ్నేశ్వరుడు

విఘ్నేశ్వరుడు
ఒకానొకప్పుడు లక్ష్మి మానస సరోవరంలో జలకమాడుతూండగా,
పార్వతి విష్ణువు వేషం ధరించి లక్ష్మిని సమీపించింది.
నవమోహ నంగా కనిపించిన నారాయణుని లక్ష్మి చూసింది.
నారాయణుడి వేషంలో ఉన్న పార్వతికి కూడా లక్ష్మి అద్భుత
సౌందర్యం అత్యంత మనోహ రంగా కనిపించింది. ఇద్దరూ
ఒకసారి సాభి ప్రాయoగా చూసుకున్నారు. ఆ చూపుల కలయికలో
సరోవరంలో ఒక స్వర్ణకమలం లేచింది.
అందులో ధగధగ మెరిసిపోతున్న పసిపాప ఉన్నది. లక్ష్మి,
నారాయణుని దగ్గిరచేరి ఆప్యా యoగా కౌగలించుకోబోయింది.
పార్వతి పగలబడి నవ్వుతూ,‘‘నేను నారాయణుడిని కాను,
లక్ష్మీ!'' అని ఆ క్షణమే నిజరూపంతో కనిపించింది.
లక్ష్మి, ‘‘అన్నకు తగ్గ చెల్లెలివే, నారాయణి
అనిపించుకున్నావులే!'' అన్నది చిన్నగా నవ్వుతూ. పార్వతి,
‘‘అప్పుడు విష్ణువు మోహినీ రూపంతో శివుణ్ణి
మాయబుచ్చినదానికి ఇది చెల్లువేసుకో!''అన్నది.
స్వర్ణకమలంలోని పసిదాన్ని చూసి ఇద్దరూ మురిసిపోయారు.
అప్పుడు విఘ్నేశ్వరుడు వచ్చి,‘‘తల్లులారా! మీ ఇద్దరి
అంశలతో అవత రించిన ఈ బిడ్డ పార్వతి పరంగా జయ,
లక్ష్మి పరంగా శ్రీ కలిసి జయశ్రీగా పెరుగుతుంది. ఆమెకు
వరుడు కూడా శివకేశవుల అంశలతో అవతరించి ఉన్నాడు!'' అని
చెప్పి, పసిదానితో ఉన్న స్వర్ణకమలాన్ని తీసుకువెళ్ళి
కావేరీ నదిలో ఉంచి రమ్మని వాయుదేవుడికి చెప్పాడు.
వాయుదేవుడలాగే జయశ్రీని కావేరినదికి చేర్చాడు. దక్షణ
ప్రాంతాన్ని పాలించే చక్రవర్తి స్వర్ణ కమలంలో కనిపించిన
బాలికను, వరప్రసా దంగా లభించిన పుత్రికగా భావించి, పరమా
నందంతో తీసుకువెళ్ళి, నామకరణ మహో త్సవం జరిపించుతూండగా,
ఆకాశవాణి, ‘‘జయశ్రీ అని పిలవండి!'' అని పలికింది.
జయశ్రీ రాకుమారిగా పెరిగి ముల్లోకాల్లో అంత సౌందర్యవతి,
సాహసవంతురాలు ఉండదనిపించుకున్నది. జయశ్రీకి రాజభవనం
కంటే ప్రకృతి సౌందర్యంతో నిండి ఉండే అరణ్యాల్లో విహ
రించడమే ఇష్టంగా ఉండేది. ఎల్లప్పుడూ విల్లమ్ములు
ధరించి, అరణ్య మధ్యానికి వెళ్ళి వన్యమృగాలను
అదుపులో ఉంచుతూ తిరుగుతూండేది. హరిహరాంశలతో అవతరించిన
స్వామి కైలాసం వెళ్ళి, విఘ్నేశ్వరుణ్ణి, కుమారస్వామిని
కలుసుకోవాలని ఎన్నాళ్ళుగానో అనుకుంటు న్నాడు.
ఒకనాడు అలాగే బయలుదేరి కైలాసం వెళ్ళాడు స్వామి.
విఘ్నేశ్వరుడు, కుమార స్వామి ఆనందంగా ముచ్చటలాడుతూ,
మానససరోవరం జలవిహారం చేస్తూండగా, విఘ్నేశ్వరుడు, ‘‘ఈ
మానససరోవరంలోనే లక్ష్మీ పార్వతుల అద్భుత
తేజస్సులతో స్వామికి కాబోయే దేవేరి ఉదయించింది!'' అని
ఊరు కున్నాడు. స్వామికి కుతూహలం కలిగినా అణుచు కొని, మరి
కొంతకాలం అక్కడ గడిపి, వెళ్ళ బోతున్నప్పుడు,
విఘ్నేశ్వరుడు,
‘‘స్వామీ! మాకంటే పెద్దవాడివైన నీవు బ్రహ్మచారిగా ఉండటం
బాగాలేదు. సత్వరంగా నీకు కళ్యా ణంతప్పదు!'' అన్నాడు.
కుమారస్వామి, విఘ్నేశ్వరుడు స్వామికి ఘనంగా వీడ్కోలు
ఇచ్చారు. స్వామి నిజ నివాసానికి చేరుకున్నాడు. ఒకనాడు
స్వామి వినోదంగా పెద్దపులి మీద స్వారీ చేస్తూ అరణ్యంలో
తిరుగుతూండగా, పులిని ముందుకూ, అటు ఇటూ కదల నివ్వ కుండా
చుట్టూరా బాణాలు రివ్వురివ్వున నాటుకున్నాయి. స్వామి బాణాలు
వచ్చిన దిశగా కోపంగా చూశాడు. ఆయన కోపం పటా పంచలైంది.
విల్లమ్ములతో ఠీవిగా నిల్చుని చిరునవ్వు విసిరిన జయశ్రీ
కనిపించి, స్వామి గుండెలో బాణంలాగ గుచ్చుకున్నది. స్వామి
అంతర్థానమయూడు. జయశ్రీకి స్వామిని గురించి
విఘ్నేశ్వరుడు కలలో కనిపించి అదివరకే చెప్పిఉన్నాడు.
అతనికోసమే వెతుకుతూ అరణ్యాల్లో తిరుగు తున్నది.
నారదుడి ఆదేశంతో, చక్రవర్తి జయశ్రీకి స్వయoవరం
ఏర్పాటు చేశాడు. రాజాధిరాజు లుగా మారురూపాలతో ఇంద్రాది
దేవతలు కూడా వచ్చారు. స్వామి ఒక సాధారణ శబర యువకుడి
రూపంతో విల్లమ్ములు ధరించి, పెద్ద నల్లని కుక్కను
వెంటబెట్టుకొని వచ్చాడు. రాజాధిరాజులు ఠీవి ఒలకబోస్తూ శబర
యువకుణ్ణీ, అతని పెంపుడు కుక్కనూ ఎక సక్కెం చేశారు.స్వామి
సింహద్వారానికి అడ్డంగా, అందర్నీ కారాగారంలో బందీలు
చేసినట్టు కుక్కమీద కూర్చున్నాడు. కుక్క పెద్ద„పులిగా
మారింది. భయoకరంగా గాండ్రుమన్నది. జయశ్రీ స్వామిని
గుర్తించి చరచరా వచ్చి వరమాల వేసి వరించింది. స్వామి జ
యశ్రీని పులిమీద ముందు కూర్చుండబెట్టుకున్నాడు. దేవతలకు
కోపం వచ్చింది. శబరయువకుడి మీద ఒక్కుమ్మడిగా
విరుచుకుపడి, ఆయుధాలు తీశారు.
స్వామి విల్లమ్ములు తీసి అందర్నీ ఎదుర్కొన్నాడు. అతని
బాణప్రెూగధాటికి దేవతలు చెల్లాచెదరై, నిజరూపాలతో
అస్ర్తాలు ప్రయే గించారు. స్వామిని ఎలాంటి అస్ర్తమూ
తాకలేక పోయింది. ఇంద్రుడి వజ్రాయుధం కూడా పనికిమాలినదైంది.
అప్పుడు స్వామి తన నిజ రూపంతో హరిహరస్వామిగా
సాక్షాత్కరిం చాడు. దేవతలు చేతులు మోడ్చారు, ‘‘శరణం
స్వామీ!'' అన్నారు. స్వామి జయశ్రీల కళ్యాణం దేవాదిదేవ
తలమధ్య మహావైభవంగా జరిగింది. జయశ్రీతో కలిసి
స్వామి ఆనందంగా నిజనివాసానికి వెళ్లాడు. త్రేతాయుగంలో
ఆర్యావర్తంలో కోసలుడు, కేకయుడు, వసుమిత్రుడు అనే
రాజులు ముగ్గురూ ఆప్తమిత్రులుగా ఉండేవారు. కోసలుడికి
కౌసల్య, కేకయుడడికి కైకేయి, వసుమిత్రుడికి సుమిత్ర
అనే కుమార్తెలు ఉన్

No comments:

Post a Comment