విభూతి ఎందుకు రాసుకుంటారు?
నెయ్యి, పలు రకాల వనమూలికలను కలిపి, ప్రత్యేకమైన
సమిధలతో భగవంతునికి ఆహుతిగా సమర్పించినప్పుడు...
అందులో నుంచి వచ్చే భస్మమే విభూతి. విభూతిని సాధారణంగా
నుదుటి మీద పెట్టుకుంటారు. కొందరు భుజాలు, ఛాతి, ఇతరత్రా
శరీర భాగాలకు కూడా రాసుకుంటారు. కొందరు ఆస్తికులైతే శరీరమంతా
రుద్దుకుంటారు. దానికి కారణం... ఏదైనా వస్తువును కాల్చినప్పుడు
బూడిదగా మారుతుంది. అయితే బూడిదను కాల్చితే మళ్లీ బూడిదే
మిగులుతుంది తప్ప అది రూపాంతరం చెందదు. అందుకే అది అతి
పవిత్రమైనదని శాస్త్రాలు చెబుతున్నాయి. అది మాత్రమే
కాక... విభూతిని ఒంటికి రాసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా
మేలు కలుగుతుంది. శరీర ఉష్ణోగ్రత అదుపులోకి వస్తుంది.
No comments:
Post a Comment