Thursday 10 September 2015

అక్షింతలు ఎందుకు చల్లుతారు

అక్షింతలు ఎందుకు చల్లుతారు?
అక్షతలు అన్నమాట నుంచి అక్షింతలు వచ్చింది. అక్షతలు
అంటే... రోకటిపోటుకు విరగని శ్రేష్టమైన బియ్యం.
నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికీ ఒక్కో ధాన్యాన్ని దాన
వస్తువుగా పేర్కొంటారు. ఆ రకంగా నవగ్రహాల్లో చంద్రుడికి
దానవస్తువు బియ్యం.
మనిషి మనసుపై చంద్రుడి ప్రభావం ఎక్కువ ఉంటుంది. అదే
విధంగా చంద్రుడికి సంకేతమైన బియ్యం కూడా మనిషి మనసుపై
ప్రభావం చూపుతుందట. చల్లేవారి శరీరంలోని విద్యుత్ను,
ఆశీస్సులు పుచ్చుకునేవారి శరీరంలోకి సరఫరా చేస్తాయి
అక్షతలు. తద్వారా తమో, రజో, సాత్వికాలనే త్రిగుణాలకు
కారకాలు అవుతాయి. కాబట్టి పెద్దల్లో ఉండే సాత్విక గుణం
అక్షింతల ద్వారా పిల్లలకు చేరుతుందనే ఉద్దేశంతోనే
శుభకార్యాల్లో వాటిని చల్లే సంప్రదాయం పెట్టారని
శాస్త్రాలు చెబుతున్నాయి.

No comments:

Post a Comment